HomeMovie News Teluguలేడీ కమెడియన్‌ తిట్టి పోసేస్తోంది

లేడీ కమెడియన్‌ తిట్టి పోసేస్తోంది

ఆటిట్యూడ్‌ పేరు చెప్పి ఈ మధ్య కొంతమంది సెలబ్రిటీస్‌ విచ్చలవిడిగా అందాలారబోసేస్తున్నారు. సోషల్‌ మీడియా వేదికగా ఈ అందాల దాడి జరుగుతోంది. అయితే అలాంటి వారిని సోషల్‌ మీడియాలో నెటిజన్లు ఊరుకోవడం లేదు. తిరిగి తమకి నచ్చినట్లుగా కామెంట్స్‌ పెడుతూ, వారిని విసిగిస్తున్నారు కూడా. అయితే మాత్రం ఈ దాడి తగ్గడం లేదు. సదరు సెలబ్రిటీలు ప్రతి విమర్శలకు దిగుతున్నారు. ఒకప్పుడు అనసూయ ఈ ట్రెండింగ్‌లో ఉంటే, తాజాగా మరో బొద్దు భామ ట్రెండింగ్‌ అయ్యింది. ఆమె ఎవరో కాదు ముద్దుగా బొద్దుగా కనిపించే కమెడియన్‌ విద్యుల్లేఖా రామన్‌.

ఈ అమ్మడు ఈ మధ్య సోషల్‌ మీడియాకి హాట్‌ టాపిక్‌ అయ్యింది. బొద్దు సౌందర్యంతో అందాల ఆరబోతకు దిగింది. దాంతో ఆమె అభిమానులు కొంత మంది సోషల్‌ మీడియాలో సెటైర్‌ వార్‌కి దిగారు. అలా తన బ్యూటీపై సెటైర్లు వేస్తున్న వారిపై ఈ బొద్దుగుమ్మ ఎదురు దాడి చేస్తోంది. అలాంటి వారిని ‘నేరో మైండెడ్‌ క్లాన్స్‌’ అని అభివర్ణిస్తోంది.ఏ పనీ పాటా లేకుండా ఇలా ఒకరి అందంపై సెటైర్లు వేసే వారిని అస్సలు పట్టించుకోకూడదు. అలాంటి వారిని పట్టించుకోవడం వల్ల అనవసరంగా వారికి వేల్యూ ఇచ్చినట్లవుతుందంటోంది. అయితే పట్టించుకోకపోతే, అదే పనిగా విమర్శించడం మొదలెడుతున్నారు. అందుకే ఈ విషయంలో స్పందించాల్సి వస్తోంది అంటోంది బొద్దు బ్యూటీ విద్యుల్లేఖా రామన్‌. 

అంతేకాదు మళ్లీ మళ్లీ చెబుతున్నా ఇది ఎక్స్‌పోజింగ్‌ కాదు..అని స్వీట్‌ వార్నింగ్‌ కూడా ఇచ్చింది కొంచెం ఘాటుగా. అయితే మరిది ఏంటంటా? అంటే అదేనండీ ఆటిట్యూడ్‌. దాన్ని ఏక్‌సెప్ట్‌ చెయ్యాలి తప్పదు. అస్సలు తప్పుపట్టకూడదూ..! అంతే కాదట. ఇంతకు ముందు కూడా ఈ ముద్దుగుమ్మ సోషల్‌ మీడియాలో హాట్‌ హాట్‌ ఫోటోల్లో దర్శనమిచ్చిందట కావాలంటే చూస్తోండి. ఇదేం ఇప్పుడు కొత్తగా మొదలెట్టింది కాదంటోంది. ఈ క్లారిటీ చాలనుకుంటా!

You May Like This
- Advertisment -spot_img

Most Popular