HomeMovie News Teluguశృతిహాసన్‌ పెళ్లంట నిజమేనా?

శృతిహాసన్‌ పెళ్లంట నిజమేనా?

విశ్వనటుడు కమల్‌ హాసన్‌ ముద్దుల తనయ శృతిహాసన్‌ పెళ్లి చేసుకోబోతోందంటూ వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని శృతి ఇంకా కన్‌ఫామ్‌ చేయలేదు. కానీ పరిస్థితలు అందుకు అనుకూలంగా ఉన్నాయంటే అవుననే అనాలి. చాలా కాలంగా శృతిహాసన్‌ మైఖేల్‌ కోర్సేతో ప్రేమలో వుందట. ఈ ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరగడం చూసి ఈ వార్తలు నిజమనే అనుకోవాలి. మొన్నీమధ్య కమల్‌ హీసన్‌తో ఓ ఇంటర్వ్యూలో శృతి హాసన్‌ ప్రేమ విషయం ప్రస్థావించగా, ఆయన కూడా పాజిటివ్‌గానే స్పందించారు.

అయితే డైరెక్టుగా కాదు. ఆయన ఏమన్నారంటే, నాది కూడా ప్రేమ వివాహమే. ఒకవేళ శృతి ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటే ఆమె ప్రేమకి ఏమాత్రం అభ్యంతరం చెప్పను. శృతి ప్రేమకు నేను అడ్డు కాననీ కమల్‌ హాసన్‌ అన్నారు. అంటే కమల్‌ వైపు నుండి శృతి హాసన్‌ ప్రేమకి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చేసినట్లే. కానీ శృతి మేఖేల్‌తో ప్రేమలో ఉన్న విషయం ఇంకా తన దృష్టికి రాలేదని ఆయన అన్నారు. ఈ మధ్యనే శృతిహాసన్‌ తన తల్లి సారికకు మైఖేల్‌ని పరిచయం చేసిందట. ఇక త్వరలోనే తండ్రి కమల్‌ హాసన్‌కు కూడా తన ప్రేమ విషయం చెప్పబోతోందట.

టాలీవుడ్‌లో నెంబర్‌ వన్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది శృతిహాసన్‌. ప్రస్తుతం ఆమె చేతిలో తెలుగులో సినిమాలేమీ లేవు. తమిళం, హిందీ భాషల్లో కూడా జోరు ప్రదర్శించింది. ఈ మధ్య తమిళంలో భారీ బడ్జెట్‌ మూవీ అయిన ‘సంఘమిత్ర’ నుండి తప్పుకుని చిత్ర యూనిట్‌తో వివాదాల్లో చిక్కుకుంది. అయితే ఆ వివాదం ప్రస్తుతం సమసిపోయింది. ప్రస్తుతం శృతిహాసన్‌ తన ప్రియుడితో లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తోందని తెలియవస్తోంది. అంటే త్వరలోనే ఇక శృతి పెళ్లి కబురు చెప్పనుందేమో చూడాలి!

You May Like This
- Advertisment -spot_img

Most Popular