HomeMovie News Teluguనయనతారే నెంబర్‌ వన్‌

నయనతారే నెంబర్‌ వన్‌

దక్షిణాది సినీ పరిశ్రమలో అత్యధిక రెమ్యునరేషన్‌ తీసుకుంటున్న హీరోయిన్‌ నయనతార. ఆమె రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా? అక్షరాలా మూడు కోట్లు. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌సింగ్‌ ఈ విషయాన్ని కన్‌ఫామ్‌ చేసింది. కాగా తెలుగులో నయనతారకి ఓ సినిమా కోసం నాలుగు కోట్లు ఆఫర్‌ చేశారనీ గాసిప్‌ వినిపిస్తోంది. అది మెగా మూవీ కోసమంటూ ప్రచారం జరుగుతోంది. మెగాస్టార్‌ 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’లో నయనతార హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసమే నయనతారకి అంత భారీ రెమ్యునరేషన్‌ ఆఫర్‌ చేశారట. సురేందర్‌ రెడ్డి డైరెక్షన్‌లో రామ్‌ చరణ్‌ నిర్మాణంలో తెరకెక్కుతోన్న సినిమా ఇది. 

కాగా తమిళంలో నయనతారకి తిరుగే లేదు. ఫుల్‌ డిమాండ్‌ ఉంది. అలాగే తెలుగులోనూ ఆమెకి మంచి డిమాండ్‌ ఉంది. కానీ సక్సెస్‌లు అయితే దక్కడం లేదు. అంతేకాదు తెలుగు సినిమా ప్రమోషన్స్‌ విషయంలో నయనతారతో కొంచెం కష్టమే కూడా. ఆమె నటించిన ‘బాబు బంగారం’ సినిమా టైంలో ప్రమోషన్స్‌ విషయమై ఆమెపై పలు విమర్శలు కూడా వచ్చాయి. అయినప్పటికీ తెలుగులోనూ ఆమెకి డిమాండ్‌ తగ్గడం లేదు. గోపీచంద్‌తో బి.గోపాల్‌ డైరెక్షన్‌లో ఓ సినిమాలో నటించింది నయనతార. అయితే ఆ సినిమా ఏమైందో ఏమో తెలీదు కానీ, తాజాగా చిరంజీవితో ‘సైరా’ లోనూ, బాలకృష్ణతో ‘జై సింహా’ చిత్రాల్లో నయనతార నటిస్తోంది. రెండూ భారీ బడ్జెట్‌ చిత్రాలే. స్టార్‌ హీరోల చిత్రాలే.

ఈ రకంగా చూసుకున్నా నయనతార డిమాండ్‌ ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇవన్నీ పక్కన పెడితే, ఏది ఏమైనా రెమ్యునరేషన్‌ విషయంలో మాత్రం సౌత్‌ ఇండస్ట్రీకి సంబంధించిన హీరోయిన్స్‌లో నయనతారే నెంబర్‌ వన్‌. ఇది పక్కా.

You May Like This
- Advertisment -spot_img

Most Popular