HomeMovie News Teluguమెగా స్టైల్‌: 'లైక్‌ ఫాదర్‌ - లైక్‌ సన్‌'

మెగా స్టైల్‌: ‘లైక్‌ ఫాదర్‌ – లైక్‌ సన్‌’

కొణిదెల వారి కోడలు మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ సతీమణి అయిన ఉపాసన సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, చరణ్‌కి సంబంధించిన కొన్ని స్వీట్‌ మెమరీస్‌ని పోస్ట్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేస్తూ ఉంటుంది. అలా తాజాగా ఓ ఫోటో పోస్ట్‌ చేసింది ఉపాసన. అదేంటనుకుంటున్నారా! చరణ్‌ – చిరంజీవి ఒకేలా ఉన్న ఫోటో అది. అంటే ఇద్దరూ సేమ్‌ టు సేమ్‌ గెడ్డాలు, మీసాలతో ఉన్న ఫోటో అన్నమాట.  

ప్రస్తుతం చరణ్‌ – సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం చరణ్‌ గుబురు గెడ్డం పెంచేశాడు. ఎందుకంటే ఆ సినిమాలో చరణ్‌ పాత్ర ఓ పల్లెటూరి యువకుడి పాత్ర. సో గుబురు గెడ్డం, డిఫరెంట్‌ లుక్‌లో ఉన్నాడు. అయితే చిరంజీవి సంగతేంటంటారా? చిరంజీవి కూడా తన 151వ చిత్రం కోసం గెటప్‌ ప్లానింగ్‌లో ఉన్నాడు. అందులో భాగంగా చిరు కూడా గెడ్డం పెంచేశాడు. ఈ ఇద్దరూ సేమ్‌ టు సేమ్‌ గెడ్డంలో సేమ్‌ టు సేమ్‌ వైట్‌ కుర్తీలేసుకుని కూర్చొని హాయిగా ముచ్చట్లాడుకుంటున్నారు. చిరంజీవి స్పెట్స్‌ పెట్టుకున్నాడు. చరణ్‌ స్పెట్స్‌ టేబుల్‌ మీద పెట్టాడు. ఇదీ ఈ ఫోటో సంగతి.

ఈ ఫోటోలో అచ్చు తండ్రీ కొడుకులిద్దరూ ఒకేలా ఉన్నారన్న మాట. మామగారిని, భర్తగారినీ ఇలా ఒకే గెటప్‌లో చూసి, ఉపాసన మురిసిపోతోంది. తన ఆనందం తనతో పాటు, అభిమానులకూ పంచాలని ఈ ఫోటోని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ఇంకేముంది ఫ్యాన్స్‌ ఆనందానికి హద్దే లేదు. ఉబ్బితబ్బిబ్బైపోతున్నారు… ఒకే గెటప్‌లో ఉన్న తమ అభిమాన హీరోలిద్దర్నీ ఇలా చూసి. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి ‘సైరా నరిసింహారెడ్డి’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకి చరణే నిర్మాత. త్వరలో సెట్స్‌ మీదికి వెళ్లనుంది. ఇక చరణ్‌ చేస్తున్న ‘రంగస్థలమ్‌’ చిత్రం షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. వచ్చే ఏడాదిలో విడుదల కానుంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular