HomeMovie News Teluguఎన్టీఆర్-చరణ్ లతో రాజమౌళి!

ఎన్టీఆర్-చరణ్ లతో రాజమౌళి!

దర్శకుడు రాజమౌళి నిన్న రాత్రి అందరిని ఒక్కసారిగా షాక్ కి గురి చేశాడు. ఆ షాక్ ఏంటో మీ అందరికి తెలిసిందే కదా- తనతో పాటు రామ్ చరణ్-ఎన్టీఆర్ లు ఉన్న ఫోటో. అయితే ఇందులో కొత్తదనం ఏమి లేకపోయినా వారు అంత సరదగా దిగిన ఫోటోని ఆ సమయంలో ఎందుకు పెట్టి ఉంటాడు అన్నది చర్చనీయాంశంగా మారింది.

ఇక వెనువెంటనే వీరి ముగ్గురి కలయికలో ఒక పెద్ద మల్టీ స్టారర్ రాన్నున్నది అని అది కూడా మే 2018లో మొదలుకానుంది అని తదితర వార్తలు సంచరించడం మొదలయ్యాయి. ఇక అభిమానులు అయితే ఎన్ని కోట్ల బడ్జెట్ అవుతుంది ఒకవేళ ఇది కార్యరూపం దాలిస్తే ఎన్ని కోట్ల వసూలు చేస్తుంది అన్న చర్చలు సోషల్ మీడియా సాక్షిగా మొదలయ్యాయి.

అయితే రాజమౌళి ఫోటో పెట్టడం దానిని రామ్ చరణ్ షేర్ చేయడం తప్ప వారి నుండి ఎటువంటి సమాచారం అయితే లేదు. ఏదేమైనా రాజమౌళి ఎవ్వరు ఊహించని దానిని చేసి చూపెలానే ఉన్నాడు అని అందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular