HomeMovie News Telugu'పవన్‌' - ఆ పేరే ఓ సంచలనం

‘పవన్‌’ – ఆ పేరే ఓ సంచలనం

పవన్‌ కళ్యాణ్‌ అంటే ఎప్పుడే సంచలనమే. హీరోగా కెరీర్‌ స్టార్ట్‌ చేసినప్పటినుండీ ఏదో మ్యాజిక్‌ చేశాడు. అంతవరకూ లేని ఏదో కొత్తదనాన్ని జనానికి పరిచయం చేశాడు. దాంతోనే విపరీతమైన అభిమానాన్ని సంపాదించుకున్నాడు. పైకి తిట్టినా, పవన్‌ ఆటిట్యూడ్‌ని లోలోపల మెచ్చుకోని వారుండరు. వ్యక్తిగతంగా పవన్‌ది ఓ సెపరేట్‌ రూటు. స్క్రీన్‌పై కనిపించే పవన్‌ వేరు. పర్సనల్‌ లైఫ్‌ పవన్‌ వేరు. ఆయన ఆలోచనలు ఎప్పుడే ఆ స్థాయిలోనే ఉంటాయి. అందుకే తన సంతానానికి నామకరణం చేసే విధానంలోనూ కొత్తగా ఆలోచించాడు పవన్‌ కళ్యాణ్‌.

పవన్‌ కళ్యాణ్‌ – రేణూ దేశాయ్‌ జంటకి కలిగిన సంతానానికి ఆధ్య, అకీరానందన్‌ అని పేర్లు పెట్టాడు. అకీరానందన్‌లో అకీరా అంటే జపనీస్‌ ది గ్రేట్‌ డైరెక్టర్‌ అకీరా కురసోవా పేరు. ఆయనంటే పవన్‌కి చాలా ఇష్టం. అందుకే ఆయనపై అభిమానంతో తన కొడుక్కి ఆ పేరు పెట్టాడు. పవన్‌ కళ్యాణ్‌ మరో భార్య అన్నా లెజినోవాకి ఇద్దరు సంతానం. ఇటీవలే ఓ బాబుకి జన్మనిచ్చింది అన్నా లెజినోవా. ఆ బాబు పేరు ‘మార్క్‌ శంకర్‌ పవనోవిచ్‌’ అని పేరు పెట్టాడు పవన్‌ కళ్యాణ్‌. లెజినోవాకి ఇంతకు ముందు ఓ కూతురుంది. ఆ కూతురు పేరేంటో తెలుసా? ‘పోలెనా అంజనా పవనోవా’.

అన్నయ్య చిరంజీవి అంటే పవన్‌కి ఎంతో అభిమానం. ఆ అభిమానంతోనే తన కొడుకు పేరులో అన్నయ్య (శివ శంకర వరప్రసాద్‌’) పేరు కలిసొచ్చేలా పెట్టాడు. అలాగే కూతురుకి అమ్మ అంజనా దేవి పేరు కలిసొచ్చేలా పెట్టాడు. పేర్ల విషయంలో పవన్‌ కళ్యాన్‌ దూర దృష్టిని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాం. ఇక పవన్‌ అభిమానాన్ని ముద్దుగా అభిమానులు ‘పవనిజం’ అని పిలుచుకుంటారన్న సంగతి తెలిసిందే. అలా పవన్‌ పేరు ఓ సంచనలనంగా మారింది. ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌, త్రివిక్రమ్‌తో ఓ సినిమాలో నటిస్తున్నాడు. యూరప్‌లో ఈ సినిమా షూటింగ్‌ జరుపుకుంటోంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular