HomeMovie News Teluguఅంతా ఫేక్‌: మెగా మూవీ హాట్‌ కేక్‌

అంతా ఫేక్‌: మెగా మూవీ హాట్‌ కేక్‌

మెగా మూవీస్‌కి సక్సెస్‌తో పాటు గాసిస్స్‌ కూడా ఎక్కువే. మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రమైన ‘సైరా నరసింహా రెడ్డి’ విషయంలో పలు గాసిప్స్‌ చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా త్వరలోనే సెట్స్‌ మీదికి వెళ్లనుంది. ఇది నిజం. కాగా ఈ సినిమా నుండి పలువురు నటీనటులు తప్పుకున్నారంటూ గాసిప్‌ ఓ పక్క, సినిమాపై హైప్‌ తగ్గిపోయిందంటూ గాసిప్స్‌ మరో పక్క తీవ్రంగా మెగా అభిమానుల్ని కలచి వేస్తున్నాయి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమా త్వరలోనే సెట్స్‌ మీదికి వెళ్లి తీరుతుంది. సినిమా కోసం సెట్స్‌ ప్రిపేర్‌ చేసే పనిలో చిత్ర యూనిట్‌ ఓ పక్క బిజీగా ఉండగా, గెటప్‌ని బిల్డప్‌ చేసే పనిలో చిరు బిజీగా ఉన్నారు.

స్క్రిప్టు పనులు దాదాపుగా పూర్తయ్యాయనీ సమాచారమ్‌. పరుచూరి బ్రదర్స్‌ ఈ సినిమాకి స్క్రిప్టు వర్క్‌ చేస్తున్నారు. బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా చిరంజీవితో గతంలో హీరోయిన్‌గా నటించిన, అలనాటి మేటి నటి, చిరుకి అత్యంత సన్నిహితురాలు ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లుగా తాజా సమాచారమ్‌. సురేందర్‌ రెడ్డి ఈ సినిమా దర్శకుడు. తొలి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరిసింహా రెడ్డి జీవిత గాధ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రమిది.

చారిత్రక నేపథ్యం కాబట్టి, ప్రతీ చిన్న విషయంలోనూ చాలా జాగ్త్రతలు తీసుకుంటున్నారు. మరో పక్క రికార్డు స్థాయిలో ఈ సినిమాకి బిజినెస్‌ జరుగుతోందట. సెట్స్‌ మీదికి వెళ్లకుండానే శాటిలైట్‌ రైట్స్‌ దక్కించుకునేందుకు, ఊహించని స్థాయిలో రామ్‌ చరణ్‌తో సంప్రదింపులు జరుగుతున్నాయనీ తెలుస్తోంది. తొమ్మిదేళ్ల గ్యాప్‌ తర్వాత వచ్చినా ‘ఖైదీ నెంబర్‌ 150’తో వంద కోట్లు కొల్లగొట్టి, రికార్డులు తిరగరాశాడు చిరంజీవి. అదీ మెగాస్టార్‌ స్టామినా!

You May Like This
- Advertisment -spot_img

Most Popular