HomeMovie News Teluguఫార్టీ ప్లస్‌ అయినా అదే ఫిట్‌నెస్‌

ఫార్టీ ప్లస్‌ అయినా అదే ఫిట్‌నెస్‌

ఇంత ఫిట్‌గా మరింత గ్లామరస్‌గా మెరిసిపోతున్న ఈ ముద్దుగుమ్మ తెలుసు కదా. ఆమెనెలా మర్చిపోతారులెండి. మర్చిపోయే అందమా ఆమెది. యూనివర్స్‌ మొత్తం మెచ్చిన అందం ఆమెది. అందుకే ‘మిస్‌ యూనివర్స్‌’ కిరీటం ఆమెని వరించింది. ఆ ముద్దుగుమ్మే సుస్మితాసేన్‌. ఆమె వయసు నాలుగు పదులు. అయినా కానీ ఆ గ్లామరేంటి? ఆ ఫిట్‌నెస్‌ ఏంటి? అదే కదా అందరి అనుమానం. అందుకే ఆమె మిస్‌ యూనివర్స్‌ అయ్యింది. అదే అందం ఇంత వయసులోనూ కంటిన్యూ చేస్తోంది.

ప్రస్తుతం వస్తున్న యంగ్‌ హీరోయిన్స్‌ కూడా మెయింటైన్‌ చేయలేని ఫిట్‌నెస్‌, గ్లామర్‌ ఆమెది. చూశారా ఈ బ్లాక్‌ కాస్ట్యూమ్‌లో సన్నగా మెరుపుతీగలా, చీకటికి అందం తెచ్చే అందమైన చందమామలా ఎలా మెరిసిపోతోందో! తెలుగులో నాగార్జునతో ‘రక్షకుడు’ సినిమాలో నటించింది. గ్లామర్‌ మెయింటైన్‌ చేయడమే కాదు, సేవా కార్యక్రమాల్లోనూ బ్యూటీ సుస్మితా ముందుంటుంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular