HomeMovie News Teluguసమంత - చైతూ పెళ్లి శుభలేఖ ఇది నిజమేనా?

సమంత – చైతూ పెళ్లి శుభలేఖ ఇది నిజమేనా?

సమంత – చైతూ పెళ్లి శుభలేఖ వచ్చేసింది. సోషల్‌ మీడియాలో ఈ శుభలేఖ చక్కర్లు కొడుతోంది. అయితే అధికారికంగా అక్కినేని ఫ్యామిలీ నుండి వచ్చిన శుభలేఖ కాదిది అంటూ మరో పక్క ప్రచారం. కానీ సోషల్‌ మీడియాలో మాత్రం వైరల్‌ అవుతోంది ఈ శుభలేఖ. గోవాలో వీరిద్దరి పెళ్లి జరగనుందన్న సంగతి తెలిసిందే. అక్టోబర్‌ 6న ఇందుకు సుముహూర్తం కుదిర్చారు అక్కినేని నాగార్జున. ఈ ముహూర్తంతోనే గోవాలోని వగేటర్‌ బీచ్‌లో ది డబ్ల్యు హోటల్‌లో వీరిద్దరి పెళ్లి వేడుక జరగనుందంటూ ఈ పెళ్లి శుభలేఖలో ఉంది. గత కొంత కాలంగా సమంత, చైతూ ప్రేమించుకుంటున్నారు.

వీరి పెళ్లికి పెద్దల అంగీకారం కూడా లభించింది. ఏప్రిల్‌లో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న ఈ జంట అక్టోబర్‌లో పెళ్లి ముడితో ఒక్కటి కాబోతున్నారు. కనీ వినీ ఎరుగని స్థాయిలో హైద్రాబాద్‌లో రిసప్షన్‌కి ప్లాన్‌ చేస్తున్నారు అక్కినేని నాగార్జున. ఈ వేడుకకి సినీ, రాజకీయ ప్రముఖుల పెద్ద ఎత్తున హాజరు కానున్నారు. కాగా ప్రస్తుతం ఈ ఇద్దరూ సినిమాలతో బిజీగా ఉన్నారు. చైతూ నటిస్తోన్న ‘యుద్ధం శరణం’ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. సమంత ‘రంగస్థలమ్‌’ సినిమాలో నటిస్తోంది. చరణ్‌ హీరోగా, సుకుమార్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతోంది ఈ సినిమా. పెళ్లి ముహూర్తం నాటికి సమంత, చైతూ ఇద్దరూ తాము ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసే యోచనలో ఉన్నారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular