HomeMovie News Teluguపోర్న్‌స్టార్‌ ఛోలీ కే పీఛే.!

పోర్న్‌స్టార్‌ ఛోలీ కే పీఛే.!

పోర్న్‌స్టార్‌ సన్నీలియోన్‌ ‘ఛోలీ కే పీఛే..’ ఏముందో తెలుసా? అందమైన మనసు దాగుంది. అది కూడా అమ్మ మనసు. అందుకే ఓ చిన్నారిని దత్తత తీసుకుంది. నిషా అనే రెండేళ్ళ చిన్నారిని సన్నీలియోన్‌, డేనియర్‌ వెబర్‌ దంపతులు దత్తత తీసుకోవడం వెనుక చాలా పెద్ద కథ ఉంది. ఇదంతా పబ్లిసిటీ కోసమే వారిద్దరూ చేశారన్న ఆరోపణల వెనుక ఎవరూ ఊహించని కోణం ఉందని అంటున్నారు నిషాని, రెండేళ్ళపాటు సాకిన అనాధ శరణాలయం నిర్వాహకులు.

ఎంతోమంది తమ అనాధ శరణాలయానికి పిల్లల కోసం వస్తుంటారనీ, రంగు చూసి ఇతరత్రా అనేక అంశాలను పరిశీలించి పిల్లల్ని తీసుకెళుతుంటారనీ, అయితే తొమ్మిది మంది తిరస్కరించబడ్డ బిడ్డ నిషాని సన్నీలియోన్‌, డేనియల్‌ వెబర్‌ దంపతులు స్వీకరించారని వారు చెప్పారు. సన్నీలియోన్‌, డేనియల్‌ వెబర్‌ కోరుకుంటూ విదేశాల నుంచి తమ అభిరుచి మేర పిల్లల్ని దత్తత తీసుకునేవారు. కానీ వారలా ఆలోచించలేదు. ఓ చిన్నారికి జీవితం ఇవ్వాలనే సదుద్దేశ్యంతో ఆలోచించారు.

పబ్లిసిటీ స్టంటే అయితే సన్నీలియోన్‌, డేనియల్‌ వెబర్‌ ఈ విషయాన్ని ఎప్పుడో చెప్పేవారే. అసలు తాము చిన్నారిని దత్తత చేసుకున్న విషయాన్నే వారు ముందుగా చెప్పలేదు. ఆ విషయం కొందరు సినీ ప్రముఖులు తెలుసుకుని, సన్నీలియోన్‌ – డేనియల్‌ వెబర్‌ దంపతుల్ని సోషల్‌ మీడియాలో అభినందించాక ఈ విషయం వెలుగు చూసింది. హేట్సాప్‌ టు సన్నీలియోన్‌ అండ్‌ డేనియల్‌ వెబర్‌.

You May Like This
- Advertisment -spot_img

Most Popular