HomeMovie News Teluguచైతూ, సమంత 'పెళ్ళి' తర్వాత 'కళ'

చైతూ, సమంత ‘పెళ్ళి’ తర్వాత ‘కళ’

నాగచైతన్య హీరోగా ఓ సినిమా తెరకెక్కనుందట. అది కూడా మారుతి దర్శకత్వంలో. పైగా సమంత హీరోయిన్‌ అట. అయితే ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్ళడానికి చాటా టైమ్‌ పట్టవచ్చునట. సినిమా టైటిలేమో ‘పెళ్ళికళ’ అట. ఇవన్నీ ఇప్పటికైతే ‘అట’లే. నిజం కావడానికి కొంత సమయం పడుతుందని ముందే చెప్పుకున్నాం కదా. అప్పటికి ఎలాగూ సమంత, నాగచైతన్యల పెళ్ళయిపోతుంది. అంటే ఇది ‘పెళ్ళి’ తర్వాత ‘కళ’ అన్నమాట. నాగచైతన్యతో సమంత తొలిసారి జోడీ కట్టిన సినిమా ‘ఏ మాయ చేశావే’. ఈ సినిమాతో ఇద్దరూ తెలుగు ప్రేక్షకుల్ని మాయ చేసేశారు స్వీట్‌ స్వీట్‌గా. ఆ తర్వాత ‘ఆటోనగర్‌ సూర్య’ సినిమాలో ఇద&్దరూ కలిసి కన్పించారు.

‘మనం’ సినిమా గురించి తెలిసినదే కదా. ఇప్పుడు ‘పెళ్ళికళ’ గురించి వస్తున్న వార్తలు నిజమైతే వీరిద్దరి కాంబినేషన్‌లో ఇది నాలుగో సినిమా అవుతుంది. చిన్న సినిమాలకి పెద్ద దర్శకుడనిపించుకున్న మారుతి, పెద్ద హీరోలతోనూ సినిమాలు తీసే స్థాయికి ఎదిగాడు. వెంకటేష్‌తో ‘బాబు బంగారం’ సినిమా తెరకెక్కించి, స్టార్స్‌ని కూడా డైరెక్ట్‌ చేయగలననిపించుకున్న మారుతి, ‘పెళ్ళికళ’ సినిమాతో తన ఇమేజ్‌ మరింత పెంచుకోవాలని చూస్తున్నాడు. వచ్చే ఏడాది నవంబర్‌లోగానీ ఈ సినిమా సెట్స్‌ మీదకు వచ్చే అవకాశం లేదట.

You May Like This
- Advertisment -spot_img

Most Popular