HomeMovie News Teluguహాలీవుడ్‌ హీరో మన భళ్లాలదేవుడు

హాలీవుడ్‌ హీరో మన భళ్లాలదేవుడు

కండలు తిరిగే శరీరం, ఆ హైట్‌ పర్సనాలిటీ, స్క్రీన్‌ ప్రెజన్స్‌ అంతా రానాది అచ్చం హాలీవుడ్‌ హీరోలానే అనిపిస్తాడు. కాదు కాదు అలా మార్చేశాడు రాజమౌళి, రానాని. ‘బాహుబలి’ సినిమా కోసం రానా క్యారెక్టర్‌ డిజైన్‌కి తగ్గట్లుగా తనని తాను అలా మలచుకున్నాడు భళ్లాలదేవుడు రానా. అదిప్పుడు కలిసొచ్చినట్టుంది. రానాకి హాలీవుడ్‌ నుండి పిలుపు వచ్చింది. త్వరలోనే మన భళ్లాలదేవుడు హాలీవుడ్‌లో అడుగు పెట్టనున్నాడు. ఇప్పటికే బాలీవుడ్‌కి రానా సుపరిచితుడే.

ఇక హాలీవుడ్‌ని కూడా దున్నేయనున్నాడు. రానా కేవలం ఓ నటుడే కాదు, చాలా టాలెంట్స్‌ ఉన్నాయి రానాలో. ప్రముఖ నిర్మాతలు, హీరోల ఫ్యామిలీ నుండి వచ్చాడు కదా. సో అలా నిర్మాణం పైనా, యాక్టింగ్‌ పైనా పట్టుంది. అలాగే మంచి ఫోటోగ్రాఫర్‌ కూడా రానా. గతంలో ఓ సినిమాకి నిర్మాణ బాధ్యతలు కూడా వహించాడు రానా. ఇప్పుడు రానా ప్రధాన పాత్రలో హాలీవుడ్‌లో ఓ సినిమా రూపొందబోతోంది. లండన్‌ డిజిటల్‌ మూవీస్‌ (ఎల్‌.డి.ఎం) అండ్‌ టీవీ స్టూడియోస్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

2018లో ఈ చిత్రం ప్రారంభం కానుంది.ఈ విషయాన్ని రానా తన ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ప్రస్తుతం రానా ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాలో నటిస్తున్నాడు. ఆగష్టు 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాజల్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహిస్తున్నారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular