HomeMovie News Teluguజగపతికి జస్ట్‌ 40 కోట్లు కావాలి

జగపతికి జస్ట్‌ 40 కోట్లు కావాలి

జగపతిబాబుకి 40 కోట్లు ఉంటే సరిపోతుందంట, అంతకన్నా ఎక్కువ అనవసరం అంటున్నాడాయన. సీనియర్‌ నటుడు జగపతిబాబు హీరోగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు కొత్త ఇన్నింగ్స్‌లో విలనిజం అదరగొట్టేస్తున్నాడు. విలనిజం ఒక్కటే కాదు, ‘శ్రీమంతుడు’ సినిమాలో జగపతిబాబు పోషించిన తండ్రి పాత్ర కూడా అద్భుతం. ఈ తరహా పాత్రలు ఈ మధ్య కాలంలో జగపతి బాబు చాలానే పోషించి మెప్పించారు. అవును ఏ నటుడు అయినా, నటి అయినా సరికొత్త పాత్రలు ఎంచుకున్నప్పుడే ప్రేక్షకులకు మరింత చేరువవుతామంటారు.

అయితే కొత్త ఇన్నింగ్స్‌ ఆర్థికంగా బాగానే వర్కవుట్‌ అవుతోందిగా? అన్న ప్రశ్నకి సమాధానమిస్తూ, నవ్వేసిన జగపతిబాబు తాము నలుగురం ఉన్నామనీ నలుగురికీ 40 కోట్లు సరిపోతాయని అన్నారు. జగపతిబాబు తండ్రి పెద్ద నిర్మాత. భారీ చిత్రాలు తీసిన ఘనుడు వి.బి.రాజేంద్రప్రసాద్‌. కొన్ని సినిమాలతో నిర్మాతగా ఫెయిల్యూర్స్‌ కూడా చవిచూశారాయన. నిర్మాణ రంగంలో ఇలాంటివి తప్పని సరి. అందుకే నిర్మాణం జోలికి తాను వెళ్ళనని జగపతి గతంలో చెప్పారు.

లేటెస్టుగా ‘పటేల్‌ సర్‌’ సినిమాతో వస్తున్నారు జగపతిబాబు. సరికొత్త హీరోయిజం ఈ సినిమాలో చూపిస్తున్నట్లు వివరించారాయన. ఈ సినిమాకి ప్రమోషన్‌ కార్యక్రమాలు కూడా బాగా చేస్తున్నారు. న్యూ గెటప్‌లో జగపతిబాబు స్పెషల్‌గా ఎట్రాక్ట్‌ చేస్తున్నారు. అంతేకాదు, లేటు వయసులోనూ ఈ సినిమాలో హీరోయిన్‌తో రొమాన్స్‌ అదరగొట్టేస్తున్నాడు మన రొమాంటిక్‌ హీరో జగపతిబాబు. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular