HomeMovie News Teluguసూపర్‌ జోష్‌తో సూపర్‌ స్టార్‌

సూపర్‌ జోష్‌తో సూపర్‌ స్టార్‌

సూపర్‌ స్టార్‌ ఎనర్జీకి ఆకాశమే హద్దు. లేటు వయసులోనూ ఆయనలో ఉత్సాహం చూస్తే ఎవరికైనా హుషారెత్తుతుంది. ఆయన హీరోగా తెరకెక్కుతోన్న ‘రోబో 2.0’ సినిమా విడుదలకి సిద్ధమైంది. ఈ సినిమాలో అమీజాక్సన్‌, సూపర్‌స్టార్‌కి జోడీగా నటిస్తోంది. బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ విలన్‌గా నటిస్తున్నాడు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. హెవీ విజువల్‌ ఎఫెక్ట్స్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇదిలా ఉండగా . ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా లేదనీ, ట్రీట్‌మెంట్‌ కోసం అమెరికా వెళ్లారనీ గాసిప్స్‌ వస్తున్నాయి.

దాంతో ఆయన అభిమానులు కలత చెందుతున్నారు. ఓ పక్క సినిమాలంటూ షూటింగ్‌లతో బిజీగా గడుపుతూనే, మరో పక్క రాజీకీయ రంగ ప్రవేశం కోసం వడి వడిగా అడుగులు కదుపుతున్నారు సూపర్‌ స్టార్‌. ఈ రకంగా ఆయన చాలా బిజీగా ఉన్నారు. ఆ కారణంగానే బిజీ షెడ్యూల్‌తో సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కొద్దిగా అస్వస్థతకు గురయ్యారు. కానీ, అది సహజమైనదే. అంతే కానీ విదేశాలకు వెళ్లేంత అనారోగ్యం కాదనీ సమాచారం. బిజీ కారణంగానే కొంచెం గ్యాప్‌ తీసుకుని మళ్లీ షూటింగ్‌లో పాల్గొననున్నారట రజనీ.

ప్రస్తుతం ఆయన పూర్తి ఆరోగ్యంగా ఫిట్‌గా ఉన్నారనీ, కోలీవుడ్‌ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఆయన ధనుష్‌ నిర్మాణంలో ఓ సినిమా చేస్తున్నారు. ‘కాలా – కరికాలన్‌’ టైటిల్‌తో ఆ సినిమా తెరకెక్కుతోంది. ఇది కూడా భారీ బడ్జెట్‌ మూవీనే. యదార్ధ సంఘటన ఆధారంగా ఈ సినిమాను ‘కబాలి’ డైరెక్టర్‌ పా రంజిత్‌ తెరకెక్కిస్తున్నారు. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular