HomeMovie News Teluguనివేదా థామస్‌కి ఫిదా అయిపోయారు

నివేదా థామస్‌కి ఫిదా అయిపోయారు

నాని హీరోగా నటిస్తోన్న తాజా సినిమా ‘నిన్నుకోరి’. రేపు ప్రేక్షకుల ముందుకు వస్తోంది ఈ సినిమా. నానితో పాటు యంగ్‌ హీరో ఆది పినిశెట్టి ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ముద్దుగుమ్మ నివేదా థామస్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇదొక ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ అనే టాక్‌ వినవస్తోంది. ట్రైలర్‌ చూస్తుంటే కూడా అదే ఫీలింగ్‌ కల్గుతోంది. కానీ మామూలు ట్రయాంగిల్‌ స్టోరీస్‌కి అత్యంత భిన్నంగా ఈ సినిమా స్టోరీ వుండబోతోందంటున్నారు ఓ పక్క. అయితే సినిమా ఇప్పటికే చూసినవారు ఇందులోని నటీనటుల పెర్ఫామెన్స్‌కి హేట్సాఫ్‌ అంటున్నారు.

‘ఇలాంటి గొప్ప నటులు ఉన్న కాలంలో మేమూ నటనా రంగాన్ని ఎంచుకున్నందుకు సంతోషంగా ఉంది’ అని కొందరు నటీనటులు సోషల్‌ మీడియాలో పేర్కొంటుండడం ఈ సినిమా గొప్పతనానికి నిదర్శనం. నాని, నివేదా తొలి సినిమా ‘జెంటిల్‌మెన్‌’ ఇద్దరి మధ్యా కెమిస్ట్రీని బాగా చూపించింది. అందులోనే నటిగా మంచి మార్కులు కొట్టేసింది నివేదా థామస్‌. ఈ సినిమాలో ఆమె ఫెర్ఫామెన్స్‌కి మాటలు చాలవంటున్నారు. ఆమె ఫేస్‌ కూడా చాలా ఎక్స్‌ప్రెసివ్‌.

సో ఈ ముద్దుగుమ్మ అలా చూస్తేనే ఎన్నో రకాల హావభావాలు పలికేస్తుంటాయి ఆమె ముఖంలో. అలాంటిది పర్‌ఫామెన్స్‌ పాత్ర ఇస్తే చెలరేగిపోదూ. అదే ఈ సినిమాలో ఆమె క్యారెక్టర్‌ అంటున్నారు. అలాగే నాని గురించి వేరే చెప్పనక్కర్లేదు. సినిమా సినిమాకీ ఏదో మ్యాజిక్‌ చేసేస్తున్నాడంతే నాని. ఈ సినిమాతోనూ నాని నిన్ను కోరి అని మరో సారి అన్పించుకునేలానే ఉన్నాడనిపిస్తోంది. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular