HomeMovie News Teluguచెవి పోగులు, ముక్కు పుడక, హీరోగారి వింత చేష్టలు

చెవి పోగులు, ముక్కు పుడక, హీరోగారి వింత చేష్టలు

బాలీవుడ్‌లో మిస్టర్‌ పెర్‌ఫెక్షనిస్ట్‌ అనే గుర్తింపు తెచ్చుకున్నాడు అమీర్‌ఖాన్‌. దానికి కారణం ఏ సినిమా చేసినా, ఆ సినిమా కోసం పూర్తిగా ఎఫెర్ట్స్‌ పెడతాడు. సినిమాలో తన పాత్ర గురించి విన్న తర్వాత, అందులో ఒదిగిపోవడానికి అతను పడే కష్టం చాలా చాలా ఎక్కువ. కష్టం అంటే అలాంటి ఇలాంటి కష్టం కాదు. తనకి తాను అర్పించేసుకుంటాడు. అదే అతన్ని ఇప్పుడు ఈ స్థాయిలో నిలబెట్టింది. ఇటీవలే ‘దంగల్‌’ సినిమాతో వరల్డ్‌ వైడ్‌గా హిట్‌ అందుకున్నాడు. ఇండియన్‌ సినిమా స్టామినాని పలు దేశాల్లో చాటి చెప్పాడు అమీర్‌ ఖాన్‌ ‘దంగల్‌’తో. ఈ సినిమా కోసం మల్లయోధుడిగా తనని తాను మార్చేసుకున్నాడు.

తాజాగా మరో సినిమా ‘థగ్స్‌ ఆఫ్‌ హిందూస్థాన్‌’లో నటిస్తున్నాడు అమీర్‌ ఖాన్‌. ఇదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయ్యింది బాలీవుడ్‌లో. ఎందుకంటే ఈ సినిమా కోసం అమీర్‌ ఖాన్‌ ఏం చేసాడో తెలుసా? చెవులకు పోగులు కుట్టించుకున్నాడు. చెవి పోగులు అంటే ఒక్కటనుకుంటున్నారా? కాదండీ బాబూ అందుకే మరి చెప్పేది ఏకంగా ఒక్కో చెవికీ మూడేసి పోగుల చొప్పున మొత్తం ఆరు పోగులు కుట్టించుకున్నాడు. అంతటితో ఆగితేనా ముక్కుకు ముక్కు పుడక కూడా పెట్టించుకున్నాడు అమీర్‌ ఖాన్‌.

ఇదంతా చేసినందుకు అమీర్‌ఖాన్‌ చాలా పెయిన్‌ ఫీలవ్వాల్సి వచ్చిందట. లేటు వయసులో కుట్టించుకున్నందుకు ఆ పెయిన్స్‌ ఇంకా పోలేదంటున్నాడు అమీర్‌ఖాన్‌. ఈ సినిమా కోసం కొత్త మీసకట్టుతో దర్శనమిస్తున్నాడు అమీర్‌ ఖాన్‌. కోరమీసం, చెవులకు ముక్కులకు పోగులతో ఉన్న అమీర్‌ ఖాన్‌ కొత్త గెటప్‌ ఇప్పుడు వైరల్‌ అయ్యింది. విజయ్‌ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌, కత్రినా కైఫ్‌, ఫాతిమా సనా షేక్‌ (‘దంగల్‌’ భామ) ఇతర ముఖ్య తారాగణం.

You May Like This
- Advertisment -spot_img

Most Popular