HomeMovie News Teluguమహేష్ గురించిన స్వీట్ సీక్రెట్స్

మహేష్ గురించిన స్వీట్ సీక్రెట్స్

సూపర్ స్టార్ గా మహేష్ బాబు అందరికి సుపరిచితమే. అయితే ఆయన  వ్యక్తిగతంగా ఎలాంటి మనిషి, తన కుటుంబసభ్యులతో ఎలా ఉంటాడో మనలో చాలా మందికి తెలియదు.

అయితే ఈ విషయాలని మహేష్ భార్య నమ్రత, ఆయన పిల్లలు- గౌతం, సితారలు బయటపెట్టారు. అందులో కొన్ని మీకోసం-

మహేష్ తన పిల్లలతో డాడీ అని కాకుండా నాన్న అని పిలిపించుకోవడానికి ఇష్టపడతాడట. చిన్నపటినుండి అదే అలవాటు చేశాడట!

మార్కులు తక్కువ వచ్చినా, బాగా అల్లరి చేసినా లేక ఇంకేదైనా గొడవ చేసిన పిల్లలని ఏమాత్రం కూడా కోప్పడడట.

ఏ కొంచెం సమయం దొరికినా కుటుంబంతో, పిల్లలతో గడపడానికే ఆసక్తి చూపుతాడట.

ఇక నమ్రత కూడా మహేష్’ గురించి చెబుతూ- పెళ్ళికి ముందు కాని తరువాత కాని ఎటువంటి ఆంక్షలు పెట్టలేదట. తన తల్లిదండ్రులు చనిపోయిన షాక్ నుండి తెరుకోవడంలో మహేష్ ఇచ్చిన మెంటల్ సపోర్ట్ చాలా ఉంది అని చెప్పింది.

మహేష్ మంచి భర్తే కాకుండా, మంచి తండ్రి అలాగే ఓ మంచి కొడుకు అని సూపర్ స్టార్ నిజంగా రియల్ లైఫ్ సూపర్ స్టార్ అని తేల్చి చెప్పింది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular