HomeMovie News Teluguమెగా మూవీ ఏడాదికి ఒక్కటేనా?

మెగా మూవీ ఏడాదికి ఒక్కటేనా?

రీ ఎంట్రీలో వచ్చిన ‘ఖైదీ నెంబర్‌ 150’ సినిమాకి వచ్చిన జోష్‌ చూసి మెగాస్టార్‌ చిరంజీవి అదే ఊపు కొనసాగించి, వరుస పెట్టి సినిమాలు చేస్తారని భావించారు మెగా అభిమానులు. కానీ చిరంజీవి ‘ఖైదీ’ తర్వాత చాలా గ్యాప్‌ తీసుకున్నారు. ఈ గ్యాప్‌ అవసరమే ఆయన తర్వాత చేయబోయే సినిమా కోసం. ఎందుకంటే ఆయన చేయబోతున్న చిత్రం అత్యంత ప్రతిష్ఠాత్మకమైనది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాధ. ఈ సినిమాకి సంబంధించి చిరంజీవి చాలా మేకోవర్‌ అవుతున్నారు.

అంతే కాదు ఈ పాత్ర చాలా బరువైన పాత్ర. ‘ఖైదీ’ సినిమాని జస్ట్‌ మాస్‌ అండ్‌ కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో సింపుల్‌గా తెరకెక్కించారు. కానీ ఇప్పుడు రాబోతున్న సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పకడ్బంధీ ప్లానింగ్‌తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. మరో పక్క చిరంజీవి ఏడాదికి ఒక్క సినిమా మాత్రమే చేయాలని తాజాగా నిర్ణయించుకున్నారట. ఒక్క సినిమా చేసినా చాలు గానీ తన నుండి వచ్చే ఔట్‌ పుట్‌ బావుండాలని అనుకుంటున్నారట.

2017లో ‘ఖైదీ’ సినిమా రాగా, 2018లో రాబోతున్న చిత్రం ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’. అంతేకాదు మరో పక్క 2018లోనే రెండు సినిమాలు వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఎందుకంటే బోయపాటి శీనుతో చిరు ఓ సినిమా చేయాల్సి ఉంది. బోయపాటి సినిమాలు చాలా తొందరగా కంప్లీట్‌ అయిపోతాయి. అన్నీ వర్కవుట్‌ అయితే ఆ లెక్కల్లో వచ్చే ఏడాది చిరంజీవి నుండి రెండు సినిమాలు రావచ్చు. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular