HomeMovie News Teluguరాజీవ్ గాంధీ హ‌త్య కేసులో రానా??

రాజీవ్ గాంధీ హ‌త్య కేసులో రానా??

బాహుబ‌లితో రానా ఇమేజ్ బాగా పెరిగిపోయింది. ఇప్ప‌టికే తెలుగు, హిందీ మార్కెట్‌ల‌కు పరిచ‌యం అయిన రానా… త‌మిళ‌, క‌న్న‌డ చిత్ర‌సీమ‌ల్నీ బాగా ఆక‌ర్షించాడు. ఇప్పుడో క‌న్న‌డ ప్రాజెక్టు రానా త‌లుపు త‌ట్టింది. రాజీవ్ గాంధీ హ‌త్యోదంతం నేప‌థ్యంలో క‌న్న‌డ లో ఓ చిత్రం తెర‌కెక్క‌నుంది. ర‌మేష్‌ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు. తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, హింది భాష‌ల్లో ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. రానా సీబీఐ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపిస్తాడ‌ని స‌మాచారం. రాజీవ్ గాంధీ హ‌త్య కేసు అప్ప‌ట్లో సంచ‌ల‌నం సృష్టించింది. ఆ కేసుని ద‌ర్యాప్తు చేసిన ఓ సీబీఐ పోలీస్ అధికారి జీవితం నేప‌థ్యంలో ఈ సినిమా సాగ‌బోతోంది. పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లో తెలుస్తాయి. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular