HomeMovie News Teluguపూరి డైరెక్షన్‌లో బాలయ్య సెన్సేషన్‌

పూరి డైరెక్షన్‌లో బాలయ్య సెన్సేషన్‌

బాలకృష్ణ కొత్త సినిమా వార్తల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. దానికి కారణమేమిటంటే ఈ సినిమా శాటిలైట్‌ రైట్స్‌ రికార్డ్‌ స్థాయిలో అమ్ముడుపోవడమేనట. 9 కోట్లు ఆ పైనే రేటు పలికిందని సమాచారమ్‌. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కుతోందంటేనే పెద్ద సెన్సేషన్‌ అయ్యింది. ఇందులో బాలకృష్ణ పాత్ర ఏంటో రివీల్‌ కాలేదు. అయినా ఈ స్థాయి హైప్‌ అంటే చిన్న విషయం కాదు. సాధారణంగా పూరి, తన సినిమాని అనౌన్స్‌ చేసేటప్పుడే టైటిల్‌ని కూడా ప్రకటించేసి, కథ ఏంటో చెప్పేస్తాడు.

ఒక్కోసారి టైటిల్‌ని పక్కన పెట్టినా అందులో హీరో క్యారెక్టరైజేషన్‌ ఇలా ఉంటుందని వెల్లడించేయడం మనందరికీ తెలుసు. కానీ బాలకృష్ణ సినిమా విషయంలో సస్పెన్స్‌ మెయిన్‌టెయిన్‌ చేస్తున్నారు. బాలకృష్ణ సినిమా నుంచి ఫ్యాన్స్‌ ఆశించే అన్ని ఎలిమెంట్స్‌ దీనిలో ఉండబోతున్నాయని నమ్మకంగా చెబుతూనే, బాలకృష్ణని ఇంతకుముందెన్నడూ చూడని విధంగా ఈ సినిమాలో చూపించబోతున్నాననీ పూరీ చెప్పారు.

‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ వంటి చారిత్రక నేపధ్యం ఉన్న పాత్రలో కనిపించిన బాలయ్య ఈ తాజా చిత్రంలో ఏ క్యారెక్టర్‌తో ఆకట్టుకుంటారా అని ఫ్యాన్స్‌ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్స్‌ పేర్లు కూడా ఇంతవరకూ సస్పెన్స్‌గానే ఉండడం విశేషం. కానీ షూటింగ్‌ మాత్రం జరుగుతోందనే సమాచారమ్‌ తెలుస్తోంది. ఏదేమైనా బాలయ్య – పూరి కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ సినిమా అప్పుడే టాక్‌ ఆఫ్‌ది ఇండస్ట్రీ అవడం అభినందనీయమ్‌. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular