HomeMovie News Teluguసన్నీలియోన్‌కి ఫ్రీ పబ్లిసిటీ

సన్నీలియోన్‌కి ఫ్రీ పబ్లిసిటీ

పోర్న్‌స్టార్‌గా ఎన్నో పోర్న్‌ సినిమాల్లో నటించిన సన్నీలియోన్‌ భారతదేశంలో అడుగుపెట్టడానికి కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. భారతీయ మూలాలున్నప్పటికీ కూడా ఆమె పోర్న్‌స్టార్‌ కావడంతోనే ఆమెను ఇండియాలోకి రానివ్వబోమని కొందరు ఆందోళన చేశారు. అయితే పోర్న్‌స్టార్‌గా కెరీర్‌ని కేవలం ఓ ప్రొఫెషన్‌గానే తాను భావించాననీ, అందరూ తనను అలాగే అర్థం చేసుకోవాలని సన్నీలియోన్‌ కోరింది. చాలా వివాదాల నడుమ సన్నీలియోన్‌ ఇండియాలోకి ఎంట్రీ ఇవ్వడమే కాకుండా, ఇక్కడే స్థిరపడిపోయింది.

బాలీవుడ్‌లో మోస్ట్‌ పాపులర్‌ భామగా మారిపోయిన ఈ బ్యూటీ, సౌత్‌లో కూడా అవకాశాలు దక్కించుకుంటూ సత్తా చాటుతోంది. అయితే ఇంకా ఈమెను వివాదాలు అలాగే వెంటాడుతున్నాయి. ఇటీవల ఓ కండోమ్‌ యాడ్‌లో నటించినందుకుగాను సన్నీలియోన్‌పై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు కొందరు. ఇలాంటి వివాదాలు ఈ మధ్యకాలంలో సన్నీలియోన్‌ చాలానే ఎదుర్కొంది. అయినప్పటికీ కూడా అలాంటి యాడ్స్‌లో నటించడం మానట్లేదు.

కండోమ్‌ యాడ్‌లో నటించడం తప్పు కాదని చెబుతూ, సురక్షితమైన శృంగారం గురించి అవగాహన కల్పించే అలాంటి యాడ్స్‌లో నటించడం కూడా సామాజిక బాధ్యతేనని వివరించింది. అయితే ఈ కండోమ్‌ యాడ్స్‌ వల్ల సన్నీలియోన్‌కి కోట్లలో రెమ్యునరేషన్‌ దక్కుతోంది. వివాదాలు తనకు ఉచితంగా పబ్లిసిటీ కూడా ఇస్తున్నాయని సన్నీలియోన్‌ చెబుతోంటే ఆమెకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నవారు ఆశ్చర్యపోతున్నారు. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular