HomeMovie News Teluguహాఫ్‌ గర్ల్‌ఫ్రెండ్‌ - ఫుల్‌ గ్లామర్‌

హాఫ్‌ గర్ల్‌ఫ్రెండ్‌ – ఫుల్‌ గ్లామర్‌

సినిమాల ఎంపికలో బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ది డిఫరెంట్‌ స్టయిల్‌. ఆమె చేసే సినిమాలు చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. సినిమా ఒప్పుకునే ముందే ఆ సినిమా గురించి పూర్తి అవగాహన తెచ్చుకుంటుందట. ఆ సినిమాకి తాను సూట్‌ అవుతానో లేదో నిర్ణయించుకుని అప్పుడు ఓకే చెబుతానని శ్రద్ధా కపూర్‌ చెప్పింది. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ, ఆ ప్రభావం తన మీద ఏమాత్రం లేకుండా కొత్తగా సినీ పరిశ్రమలోకి వచ్చిన ఓ సాధారణ యువతిగా మాత్రమే కష్టపడుతుందట శ్రద్ధా కపూర్‌.

పర్టిక్యులర్‌గా గ్లామర్‌ విషయానికొస్తే సినీ నేపథ్యం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందని అంటున్న ఈ బ్యూటీ, కథ ప్రకారం గ్లామరస్‌గా కన్పించాల్సి వచ్చినప్పుడు అది తప్పని తాను ఫీలవబోనని ఈ విషయంలో తనకు తన కుటుంబం నుంచి పూర్తి మద్దతు ఉందని వివరింది. ‘హాఫ్‌ గర్ల్‌ఫ్రెండ్‌’ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న శ్రద్ధ, ఇందులోనూ గ్లామరస్‌గా రెచ్చిపోతుందట. టైటిల్‌లో ‘హాఫ్‌’ ఉన్నంతమాత్రాన, గ్లామర్‌ సగమే ఉంటుందనుకునేరు? డబుల్‌ డోస్‌ గ్లామర్‌ ఉంటుందని శ్రద్ధ సంకేతాలు పంపింది.

ఆమె మాటలకు తగ్గట్టుగానే సినిమా ప్రోమోస్‌లో శ్రద్ధ గ్లామర్‌ అదిరిపోతోంది. లిప్‌ టు లిప్‌ కిస్‌లకైనా, టూ పీస్‌ బికినీలకైనా నో చెప్పకపోవడం శ్రద్ధా కపూర్‌ మరో ప్రత్యేకత. ఏం చేసినా నటనలో భాగమేనట. ఆ ఒక్కటీ చాలు ఈ బ్యూటీ ఎంత ముదురో చెప్పడానికి.

You May Like This
- Advertisment -spot_img

Most Popular