HomeMovie News Teluguచైతూతో చందూ ఈసారి 'మాస్‌'

చైతూతో చందూ ఈసారి ‘మాస్‌’

నాగచైతన్యకి మాస్‌ సినిమాలకన్నా క్లాస్‌ సినిమాలే మంచి పేరు తెచ్చాయి. అయినప్పటికీ కూడా నాగచైతన్యకి మాస్‌ ఇమేజ్‌ అంటే ఇష్టం. అందుకే మాస్‌ హీరోగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అలా ప్రయత్నిస్తేనే అతనిలోని కసి బయటపడుతుంది, ఖచ్చితంగా విజయం వరిస్తుంది. ‘తడాఖా’ రూపంలో నాగచైతన్యకి మంచి మాస్‌ హిట్‌ ఉన్నా, అది అతని సోలో సినిమా కాదు. అందులో సునీల్‌ మరో హీరోగా నటించాడు. అది మల్టీస్టారర్‌గా భావించాలి.

ఈసారి నాగచైతన్య మాస్‌ సినిమా చేయనున్నది చందు మొండేటి దర్శకత్వంలో. ‘ప్రేమమ్‌’ సినిమా కోసం వీరిద్దరూ పనిచేశారు. ఆ టైమ్‌లోనే ఇంకో సినిమా చేయాలని ఇద్దరూ అనుకున్నారట. అనుకున్నదే తడవు నాగచైతన్య కోసం చందు మొండేటి అద్భుతమైన మాస్‌ కథని రెడీ చేశాడని సమాచారమ్‌. కథ కూడా ఓకే అయ్యిందనీ అతి త్వరలో సినిమా సెట్స్‌ మీదకు వెళ్ళనుందనీ సమాచారమ్‌.

నాగచైతన్య ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ఒకటి ‘రారండోయ్‌…’ విడుదలకు సిద్ధమైంది. ఇదిలా ఉండగా చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా నటించే చిత్రాన్ని నాగార్జున నిర్మించనున్నారని సమాచారమ్‌. ఓ ప్రముఖ హీరోయిన్‌ ఈ సినిమాలో నాగచైతన్య సరసన నటించనుందట. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular