HomeMovie News Teluguమహేష్‌ ఈ సారైనా నమ్మొచ్చా?

మహేష్‌ ఈ సారైనా నమ్మొచ్చా?

మహేష్‌తో బాలీవుడ్‌ బ్యూటీలు జత కట్టబోతున్నారంటూ ఎప్పటికప్పుడే సెన్సేషస్‌ అవుతూ ఉంటుంది. ఈ రకమైన గాసిప్స్‌తో ఓ డజను బాలీవుడ్‌ హీరోయిన్లు మహేష్‌ లిస్టులోకి చేరిపోయారు. గతంలో దీపికా పదుకొనె, అనుష్కా శర్మ, సోనమ్‌ కపూర్‌ తదితర నటీమణులు మహేష్‌ పుణ్యమా అని టాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తారని ఆశించారంతా. కానీ అలా జరగలేదు. ‘వన్‌ నేనొక్కడినే’ సినిమాలో మాత్రం కృతిసనన్‌ హీరోయిన్‌గా నటించింది.

అయితే ఈ ముద్దుగుమ్మకి అప్పటికి బాలీవుడ్‌లో అంత పాపులారిటీ లేదు. తాజాగా మళ్లీ ఇదే క్రమంలో గాసిప్స్‌ చక్కర్లు కొడుతున్నాయి. మహేష్‌ – కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం కొరటాల బాలీవుడ్‌ భామని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ లిస్టులో కైరా అద్వానీ పేరు వినిపిస్తోంది. ఈ సారి ఈ ముద్దుగుమ్మ ఖచ్చితంగా మహేష్‌తో జత కడుతుందంటున్నారు సినీ ప్రముఖులు. కానీ ఈ విషయంలో ఇంకా అఫీషియల్‌గా క్లారిటీ రాలేదు. కానీ న్యూస్‌ అయితే బాగా ప్రచారంలో ఉంది.

ఏమో ఈ సారైనా మహేష్‌ బాలీవుడ్‌ బ్యూటీని టాలీవుడ్‌కి పరిచయం చేస్తాడో లేదో చూడాలి. ఈ సినిమాకి ‘భరత్‌ అను నేను’ అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారు. మరో పక్క మహేష్‌ – మురుగదాస్‌ కాంబినేషన్‌లో సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమాలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతోన్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular