HomeMovie News Telugu'రెడ్డి' ఈ సారి గట్టిగానే కొట్టేస్తాడట

‘రెడ్డి’ ఈ సారి గట్టిగానే కొట్టేస్తాడట

విజయ్‌ దేవరకొండ కొత్త సినిమా ‘అర్జున్‌ రెడ్డి’ ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు ముస్తాబవుతోంది. ‘పెళ్ళిచూపులు’ సినిమాతో రాత్రికి రాత్రి స్టార్‌ అయిపోయిన విజయ్‌ దేవరకొండకి, ‘ద్వారక’ ఆశించిన విజయాన్నివ్వలేదు. అయితే ప్రీ రిలీజ్‌ బజ్‌ మాత్రం ఆ సినిమాకి చాలా పాజిటివ్‌గా రావడంతో ఓపెనింగ్స్‌ అదిరిపోయాయి. ఆ సినిమా సంగతి అలా ఉంచితే ‘అర్జున్‌ రెడ్డి’తో బ్లాక్‌ బస్టర్‌ సొంతం చేసుకుంటాననే ధీమా విజయ్‌ దేవరకొండలో కనిపిస్తోంది.

‘అర్జున్‌ రెడ్డి’ ఇప్పటికే టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయ్యింది. దానికి కారణం పక్కా మాస్‌ అనేలా సినిమా లుక్స్‌ బయటకు రావడం, అలాగే సినిమాలో గాఢమైన లిప్‌ కిస్‌ సీన్స్‌ ఉండటమే కావొచ్చు. అవే కాదు, అంతకు మించి సినిమాలో ఏదో ఉందనే సంకేతాల్ని పంపుతోంది చిత్ర యూనిట్‌. షూటింగ్‌ పూర్తి చేసుకుని, డబ్బింగ్‌ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ‘అర్జున్‌ రెడ్డి’ అతి త్వరలో ప్రేక్షకుల ముందుకొచ్చేస్తాడట.

మాస్‌ మెచ్చే అంశాలతోపాటు, పక్కింటి కుర్రాడు అనే స్థాయిలో క్లాస్‌ ఆడియన్స్‌ని మెప్పించే లుక్స్‌ కొట్టొచ్చినట్లు కన్పించడం విజయ్‌ దేవరకొండ ప్రత్యేకత. అందుకే అన్ని అంశాల్నీ దృష్టిలో పెట్టుకుని ‘అర్జున్‌రెడ్డి’లో అతన్ని దర్శకుడు చాలా కొత్తగా చూపించబోతున్నాడని సమాచారమ్‌. టీజర్‌ ఇప్పటికే సంచలనాలు సృష్టించగా, సినిమా మరింతగా సంచలనాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అవుతుందని చిత్ర యూనిట్‌ ధీమాగా చెబుతోంది. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular