HomeMovie News Teluguరేవంత్ దే ఇండియన్ ఐడల్ టైటిల్

రేవంత్ దే ఇండియన్ ఐడల్ టైటిల్

ప్రముఖ తెలుగు నేపధ్య గాయకుడైన ఎల్ వీ రేవంత్ ప్రఖ్యాత ఇండియన్ ఐడల్ 9 సీజన్ టైటిల్ గెలుచుకున్నాడు.

తోటి పోటిదారులైన ఖుదా బక్ష్ మరియు రోహిత్ లు గట్టి పోటీ ఇచ్చినా చివరికి రేవంత్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. ఈ టైటిల్ సాదించడంతో రేవంత్ కి 25లక్షల నగదు, మహీంద్రా కేయువీ 100 తో పాటు సోనీ మ్యూజిక్ తో కాంట్రాక్ట్ కూడా సొంతం అయింది.

కొసమెరుపు ఏంటంటే.. క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కార్యక్రమం చివరిలో వచ్చి విజేతని ప్రకటించి ట్రోఫీ అందించడం.

You May Like This
- Advertisment -spot_img

Most Popular