HomeMovie News Teluguఅనుష్కపై డౌట్స్‌ అలానే ఉన్నాయి

అనుష్కపై డౌట్స్‌ అలానే ఉన్నాయి

స్వీటీ బ్యూటీ అనుష్క త్వరలోనే ‘బాహుబలి ది కన్‌క్లూజన్‌’తో మన ముందుకు రానుంది. ఇటీవలే ‘నమో వేంకటేశాయ’ సినిమాతో కృష్ణమ్మగా అలరించింది. ఈ సినిమాలో అనుష్క అందంగా ఉన్నా, కొంచెం బొద్దుగానే కనిపించింది. అయితే ‘బాహుబలి 2’ సినిమాలో కూడా అనుష్క అలానే ఉండబోతోందా? అంటూ అనుమానాలు వస్తున్నాయి. ట్రైలర్‌ చూశాక కూడా ఈ అనుమానాలు నివృత్తి కావడం లేదు. బాహుబలి ది బిగినింగ్‌’లో అనుష్క చాలా సన్నగా కనిపించింది.

అయితే అందులో స్వీటీ పాత్ర నిడివి చాలా తక్కువ, అలాగే డీ గ్లామర్‌ రోల్‌ కావడంతో అనుష్క గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. కానీ ఈ పార్ట్‌లో అనుష్కది కీలక పాత్ర. దాంతో ఆమె దేహ ఆకృతి కోసం అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ప్రయోగాత్మక చిత్రం ‘సైజ్‌ జీరో’ కోసం అనుష్క తన నాజూకు శరీరాన్ని రిస్క్‌లో పెట్టింది. ఆ తర్వాత సన్నబడేందుకు ఆమె చాలా కసరత్తులు చేసింది కానీ అది సాధ్యపడలేదు. ఈ మధ్య వచ్చిన అనుష్క సినిమాలన్నింట్లోనూ బొద్దుగానే కనిపిస్తూ వచ్చింది. మరి ఈ సినిమాలో అనుష్క ఎలా ఉండబోతోందనేది మాత్రం క్లారిటీ రావడం లేదు.

ట్రైలర్‌లో అక్కడక్కడా అనుష్క కనిపిస్తోంది. యుద్ధ సన్నివేశాల్లో కూడా కనిపిస్తోంది. అయినా ఆమె ఫిజిక్‌ విషయంలో ఎందుకో అనుమానాలు తీరడం లేదు. మరో పక్క తొలి పార్ట్‌లో అనుష్కది డీ గ్లామర్‌ రోల్‌. కానీ ఈ పార్ట్‌లో అనుష్కకి, ప్రబాస్‌కీ మధ్య లవ్‌ ట్రాక్‌.. రొమాంటిక్‌ సీన్స్‌ భలే బాగా ఉండబోతున్నాయట. ట్రైలర్‌లో కూడా అది తెలుస్తోంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular