HomeMovie News Teluguఓ భావన.. నువ్వు గ్రేట్‌

ఓ భావన.. నువ్వు గ్రేట్‌

ఇటీవలే లైంగిక వేధింపుల గొడవలో సెన్సేషన్‌ అయ్యింది నటి భావన. ఈ ఘటనపై భావనకు మాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌, టాలీవుడ్‌ సినీ పరిశ్రమ అండగా నిలబడింది. తనపై జరిగిన అఘాయిత్యానికి సిగ్గుపడో, భయపడో మరుగున ఉండిపోకుండా, ధైర్యంగా తనపై జరిగిన అమానుషాన్ని బయట పెట్టింది. ఈ రకమైన లైంగిక వేధింపులతో బాధపడే మహిళలందరికీ ఆదర్శంగా నిలిచింది నటి భావన. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటది కాబోతోంది. తాను కోరుకున్న వ్యక్తిని పెళ్లాడబోతోంది.

తాను హీరోయిన్‌గా ఉన్నప్పుడే మలయాళ ప్రొడ్యూసర్‌ నవీన్‌ని భావన ప్రేమించింది. ఆయనతోనే ఇప్పుడు భావన నిశ్చితార్ధం జరిగింది. భావనపై .జరిగిన అమానుష ఘటనని నవీన్‌ కూడా తీవ్రంగా ఖండించారు. అలాగే ఆమెను వివాహం చేసుకోవడానికి ముందుకొచ్చిన ఆయన్ని అందరూ అభినందిస్తున్నారు. వీరిద్దరూ గత నాలుగైదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. రెండేళ్ల క్రితమే వివాహం చేసుకోవాలనుకున్నారు కానీ, సినిమాల బిజీతో కుదరలేదు.

గురువారం తమ కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ ఇద్దరికీ నిశ్చితార్ధం ఘనంగా జరిగింది. ఈ విషయం తెలిసి, సినీ పరిశ్రమలో పలువురు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఆనందం వ్యక్తం చేశారు. తెలుగులో ‘ఒంటరి, మహాత్మ’ తదితర చిత్రాల్లో నటించింది ముద్దుగుమ్మ భావన. అలాగే తమిళంలో కూడా పలు సక్సెస్‌ఫుల్‌ మూవీస్‌లో నటించింది. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular