HomeMovie News Teluguనితిన్‌ పవర్‌ఫుల్‌ ప్లాన్‌

నితిన్‌ పవర్‌ఫుల్‌ ప్లాన్‌

పవన్‌ కళ్యాణ్‌ హీరోగా వస్తోన్న ‘కాటమరాయుడు’ సినిమాకి యంగ్‌ హీరో నితిన్‌ నైజాం హక్కుల్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. పవన్‌కి నితిన్‌ వీరాభిమాని అన్న మాట ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీలు చిక్కినప్పుడల్లా తన అభిమానాన్ని నితిన్‌ చాటుకుంటూనే ఉంటాడు. అదే అభిమానంతో ఇప్పుడు ‘కాటమరాయుడు’ రైట్స్‌ దక్కించుకున్నాడు. అంతేకాదు నితిన్‌ ఈ సినిమాని ఎంతో ప్రెస్టీజియస్‌గా తీసుకోనున్నాడట.

రైట్స్‌ సొంతం చేసుకోవడమే కాదు, సినిమా ప్రమోషన్‌ విషయంలో కూడా తన వంతు సహకారం అందించనున్నాడట నితిన్‌. ప్రొడ్యూసర్‌ కమ్‌ డిస్ట్రిబ్యూటర్‌ అయిన దిల్‌ రాజు కూడా తను నిర్మించిన సినిమాలకే కాకుండా, డిస్ట్రిబ్యూట్‌ చేసే సినిమాలకు కూడా ప్రమోషన్‌ బాగా నిర్వహిస్తాడు. ఇప్పుడు నితిన్‌ కూడా అదే బాటలో నడుస్తున్నాడంటున్నారు. అదే కాక మరో పక్క పవన్‌పై అభిమానమే ఇందుకు కారణం అంటున్నారు కూడా. ‘కాటమరాయుడు’ ప్రమోషన్‌కి నితిన్‌ ఇప్పట్నుంచే చాలా ప్లాన్‌లు వేస్తున్నాడట.

సరికొత్తగా ప్రమోషన్‌ చేయాలని నితిన్‌ భావిస్తున్నాడట. అలాగే మరో పక్క పవన్‌ కళ్యాణ్‌, నితిన్‌ మీద ఉన్న అభిమానంతో త్రివిక్రమ్‌తో కలిసి నితిన్‌ సినిమాకి నిర్మాణం వహిస్తున్నారు. ఆ అభిమానాన్ని నితిన్‌ కూడా చాటుకోవాలి కదా. అందుకే ఈ సినిమా విషయంలో చాలా కేర్‌ తీసుకోవాలనుకుంటున్నాడట. మొత్తానికి పవన్‌పై ఉన్న అభిమానాన్ని చాటుకునేందుకు రైట్‌ టైం దొరికింది నితిన్‌కి కాటమరాయుడు’ సినిమా రైట్స్‌తో. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular