HomeMovie News Teluguకాజల్‌ రూటు మార్చింది

కాజల్‌ రూటు మార్చింది

ఇంతవరకూ కమర్షియల్‌ సినిమాల్లోనే తన సత్తా చాటిన ముద్దుగుమ్మ కాజల్‌ అగర్వాల్‌ మనసు మార్చుకుంది. సీనియర్‌ నటి అన్పించుకోవాలని తపన పడుతోంది. అంటే తాను కూడా ప్రయోగాలు చేయడానికి రెడీ అవుతోందన్న మాట. ఇంతవరకూ గ్లామరస్‌ పాత్రలతో ఆకట్టుకున్న చందమామ కాజల్‌ అగర్వాల్‌ ఇకపై హీరోయిన్‌ సెంట్రిక్‌ మూవీస్‌కి సై అంటోంది. నటిగా చాలా పాత్రల్లో తన సత్తా చాటింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఓ నటిగా తనలోని మరిన్ని భిన్న కోణాలను బయటికి తీయాలంటే అందుకు తగ్గ ఛాలెంజింగ్‌ పాత్రలు ఎంచుకుని తీరాల్సిందే అంటోంది.

అందుకు ఇంతవరకూ టైం రాలేదు. కానీ తాజాగా ఆ తరహా ప్రయోగం చేసేందుకు కాజల్‌కి ఓ అవకాశం వచ్చినట్లు సమాచారమ్‌. తమిళంలో ఓ ప్రముఖ డైరెక్టర్‌ కాజల్‌తో హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ మూవీని తెరకెక్కించాలని అనుకుంటున్నాడట. ఈ సినిమాని తెలుగులో కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారమ్‌. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. కాగా, ఇటీవలే ‘ఖైదీ నెంబర్‌ 150’ సినిమాతో తిరుగులేని విజయాన్ని అందుకున్న ముద్దుగుమ్మ కాజల్‌, ప్రస్తుతం తమిళంలో ఫుల్‌ బిజీగా గడుపుతోంది.

ఈ తాజా ప్రాజెక్టుతో తనలోని కొత్త నటిని పరిచయం చేయబోతున్నానంటోంది ముద్దుగుమ్మ కాజల్‌. అంతేకాదు ఏ హీరోయిన్‌కైనా ప్రాధాన్యత ఉన్న సినిమాలో నటించినప్పుడే అసలైన సంతృప్తి. ఆ తృప్తి నాకు ఈ సినిమాతో కలగనుంది అని తెగ సంబరపడిపోతూ చెబుతోంది ముద్దుగుమ్మ కాజల్‌ అగర్వాల్‌. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular