HomeMovie News Telugu'డీజె' టాక్: కూల్‌ అండ్‌ స్టైలిష్‌

‘డీజె’ టాక్: కూల్‌ అండ్‌ స్టైలిష్‌

మహా శివరాత్రి సందర్భంగా అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కుతోన్న ‘దువ్వాడ జగన్నాధమ్‌’ టీజర్‌ విడుదలైంది. ఈ టీజర్‌లో బన్నీ పంతులు గెటప్‌లో ఉన్నా, చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. అందుకే మరి హీరోయిన్‌కి అంతగా నచ్చేశాడు. ఆగలేక ముద్దుల మీద ముద్దులు పెట్టేసేంతగా నచ్చేశాడు. ‘ఇలా ఇలా ముద్దులు పెట్టేసి సభ్య సమాజానికి ఏం మెసేజ్‌ ఇద్దామని..’ అంటూ బన్నీ చెప్పే డైలాగ్‌ ఆకట్టుకుంటోంది. పంతులు యాసలో బన్నీ ఆ డైలాగ్‌ చెప్పే విధానానికి ఫ్యాన్స్‌ సంబరపడిపోతున్నారు.

ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ చూసి చాలా చప్పగా ఉందనుకున్నారంతా. కానీ ఈ టీజర్‌తో అల్లు అర్జున్‌ సినిమాలో ఉండాల్సిన మసాలాలన్నీ దట్టంగా ఉన్నట్లుగానే అనిపిస్తోంది. హీరోయిన్‌ పూజా హెగ్దే చాలా హాట్‌గా కనిపిస్తోంది. ఇంత తక్కువ టైం ఉన్న టీజర్‌లోనే అమ్మడు ఇంత హాట్‌గా కనిపించేస్తే ఇక సినిమాలో ఇంకెంత గ్లామర్‌ ఒలకపోసేసిందో ఏమో మరి. హరీష్‌ శంకర్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాని సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

‘సరైనోడు’ సినిమాతో మాస్‌ హిట్‌ అందుకున్న అల్లు అర్జున్‌ ఈ సినిమాతో ఇటు క్లాస్‌ అటు మాస్‌ రెండు వర్గాల్నీ అలరించేలా ఉన్నాడు. వినోదంతో పాటు యాక్షన్‌ సీన్స్‌ కూడా అదిరిపోయేలానే ఉన్నాయి. గెటప్పే పంతులు గెటప్‌ కానీ, ఉండాల్సిన అన్ని స్టైల్స్‌ అల్లు అర్జున తన బాడీ లాంగ్వేజ్‌లో చూపించనున్నాడట ఈ సినిమాలో.

You May Like This
- Advertisment -spot_img

Most Popular