HomeMovie News Teluguబాల డైరెక్షన్‌లో జ్యోతిక ప్రయోగం

బాల డైరెక్షన్‌లో జ్యోతిక ప్రయోగం

తెరపై నేచురల్‌గా పాత్రల్ని తీర్చిదిద్దడంలో దిట్ట దర్శకుడు బాల. ఆయన డైరెక్షన్‌లో వచ్చే సినిమాలన్నీ డబ్బింగ్‌ చిత్రాలైనా కానీ తెలుగు నేటివిటీస్‌కి తగ్గట్లుగా ఇమిడిపోతాయి. అలాంటి దర్శకుడితో ఇప్పుడు నేచురల్‌ బ్యూటీ జ్యోతిక ఓ సినిమా చేస్తోంది. తమిళ్‌ హీరో సూర్యని వివాహమాడిన తర్వాత ఆమె కొన్నాళ్లు సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. తల్లి అయినా కానీ ఆమెలోని అందం తరగలేదు. అందుకే సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేసింది.

సెకండ్‌ ఇన్నింగ్స్‌లో జ్యోతిక తన వయసుకు తగ్గ పాత్రల్నే ఎంచుకుంటూ, జోరు ప్రదర్శిస్తోంది. సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేసిన జ్యోతిక ఫస్ట్‌లో కొంచెం స్లోగా ఉన్నప్పటికీ మెల్ల మెల్లగా వేగం పెంచింది. జోరు గా సినిమాలు ఒప్పుకుంటోంది. అయితే తాజా చిత్రం అంచనాల్ని పెంచుతోంది. బాల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో జ్యోతిక పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉండబోతోందట.

ఆయన డైరెక్షన్‌లో వచ్చిన ‘శివపుత్రుడు’, నేను దేవుణ్ణి’, ‘వాడు వీడు’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయిన దర్శకుడు బాల. అంతేకాదు పలు జాతీయ పురుస్కారాలు కూడా అందుకున్నారాయన. అయితే ఇప్పుడు జ్యోతికతో తెరకెక్కించే చిత్రం పట్ల ఇటు టాలీవుడ్‌, అటు కోలీవుడ్‌లో కూడా ఆశక్తి నెలకొంది. అందులోనూ జ్యోతిక పాత్రపై మరింత ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular