HomeMovie News Teluguమహేష్ చేతిలో మెగా హీరో పాట!!

మహేష్ చేతిలో మెగా హీరో పాట!!

సూపర్ స్టార్ మహేష్ టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బడా హీరో. అయితే తన తోటి హీరోల సినిమాకి తనవంతు సహాయం చేయాడానికి ఎప్పుడు ముందు ఉంటాడు.

వివరాల్లోకి వెళితే, మహేష్ ఈ రోజు సాయంత్రం 7గంటలకు సాయి ధరం తేజ నటించిన విన్నర్ చిత్రంలోని ‘సితార’ అనే పాటను విడుదల చేయనున్నాడు. ఈ విషయాన్ని విన్నర్ టీం- హీరో సాయి ధరం తేజ్, హీరోయిన్ రకుల్ ప్రీత్ లు తెలిపారు. అయితే ఇందులోని కొసమెరుపు ఏంటంటే మహేష్ కూతురి పేరు కూడా “సితార”.

ఇక ఈ చిత్రం మ్యూజిక్ విషయానికి వస్తే, తమన్ అదిరిపోయే ట్యూన్స్ ఇచ్చాడు అని ఇన్సైడ్ టాక్ అలాగే ఇది వీరి ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా.

చూద్దాం.. మరి మహేష్ విడుదల చేయబోతున్న ఈ సితార పాట ఎలా ఉండబోతుందో!

You May Like This
- Advertisment -spot_img

Most Popular