HomeMovie News Teluguనాగార్జున డ్రీమ్‌ రోల్‌ అదేనట

నాగార్జున డ్రీమ్‌ రోల్‌ అదేనట

టాలీవుడ్‌ మన్మధుడిగా ఇంత వయసులోనూ అమ్మాయిలకి కిర్రాక్‌ పుట్టించే హ్యాండ్‌సమ్‌ హీరో నాగార్జున. రొమాంటిక్‌ హీరోగా తన ప్లేస్‌ని ఇంకెవ్వరూ భర్తీ చేయలేకపోయారు. తాజాగా ప్రయోగాత్మక చిత్రాలకు కూడా ఈ మధ్య నాగార్జున ముందంజలో ఉన్నారనే చెప్పొచ్చు. ‘ఊపిరి’ వంటి సినిమాతో ఇంతవరకూ ఏ హీరో చేయని సాహసం చేశాడు నాగార్జున ఈ సినిమాతో. సినిమా అంతా వీల్‌ చైర్‌కే పరిమితమైన పాత్రలో నాగార్జున నటన మనసుకి హత్తుకునేలా ఉంటుంది.

అలాగే ఓ ‘అన్నమయ్య’ అయినా, శ్రీరామదాసు అయినా, షిరిడీ సాయి అయినా తాజాగా ‘ఓం నమో వేంకటేశాయ’లో హథీరామ్‌ బాబా పాత్ర అయినా అది నాగార్జునకే చెల్లింది. ఇన్ని వేరియేషన్స్‌ ఉన్న పాత్రలతో ఆకట్టుకున్నా, కానీ నాగార్జునకి ఒకే ఒక కోరిక మిగిలిపోయిందట. ఇన్నాళ్లుగా అలాంటి అవకాశం రాలేదంటున్నాడు నాగార్జున. అదే హర్రర్‌ మూవీలో నటించడం. ఆ కోరిక త్వరలోనే నెరవేరబోతోంది.

ఓంకార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాజు గారి గది’ సినిమా హర్రర్‌ మూవీస్‌లో చాలా సక్సెస్‌ అయిన మూవీ. ఇప్పుడు అదే సినిమాకి సీక్వెల్‌లో నాగార్జున నటించాలనుకోవడం కూడా ఓ సాహసమే. అదే సాహసం చేయబోతున్నాడు నాగార్జున. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌ మీదికి వెళ్లనుందట. ఈ సినిమాని నాగార్జున ఎంతో ఇష్టపడి చేయాలనుకుంటున్నాడట. ఈ సినిమాతో తన డ్రీమ్‌ ఫుల్‌ ఫిల్‌ అవుతుందంటున్నాడు నాగార్జున. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular