HomeMovie News Teluguకన్‌ఫామ్‌ బిగ్‌-బి చెయ్యాల్సిందదే

కన్‌ఫామ్‌ బిగ్‌-బి చెయ్యాల్సిందదే

బిగ్‌-బి అమితాబ్‌ బచ్చన్‌ తెలుగులో కొన్ని సినిమాల్లో నటించారు. వాటిల్లో ఒకటి ‘అమృతవర్షం’ కాగా మరొకటి ‘మనం’ సినిమా. ‘మనం’ సినిమాలో అతిథి పాత్రలో కనిపిస్తారు అమితాబ్‌ బచ్చన్‌. ఆయన్ని తెలుగులో కాస్త వెయిట్‌ ఉన్న పాత్రలో చూపించేందుకు క్రియేటివ్‌ డైరెక్టర్‌ కృష్ణవంశీ ప్రయత్నిస్తున్నాడు. బాలకృష్ణ 101వ చిత్రమిది. కృష్ణవంశీ, బాలకృష్ణ కలిసి బిగ్‌-బితో ఈ సినిమా గురించి చర్చించారు. అయితే అమితాబ్‌ బచ్చన్‌ ఇంతవరకు ఈ సినిమాలో నటించడంపై స్పష్టత ఇవ్వలేదు.

రాష్ట్రపతి పాత్రలో అమితాబ్‌ బచ్చన్‌ నటించాల్సి ఉంది. ఇప్పటిదాకా అమితాబ్‌కి కృష్ణవంశీ ఆఫర్‌ చేసిన పాత్రపై వినిపిస్తున్నవన్నీ గాసిప్సే. అయితే హీరో బాలకృష్ణ, అది రాష్ట్రపతి పాత్ర అని కన్‌ఫామ్‌ చేశారు. ఏడెనిమిది రోజులు మాత్రమే ఆ పాత్ర కోసం అమితాబ్‌ బచ్చన్‌ నటించాల్సి ఉంటుందట. ‘రైతు’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం ఎంతో ప్రతిష్టాత్మకమైనదిగా భావిస్తున్నారు.

అందుకనే పాత్రల కోసం ఆయా నటుల్ని ముందే ఫిక్సయిపోయి, ఎట్టి పరిస్థితుల్లోనూ వారు కాకుండా ఇంకొకరితో చేసేందుకు ‘రైతు’ టీమ్‌ సుముఖత వ్యక్తం చేయడంలేదు. అలా ‘రైతు’ సినిమా సస్పెన్స్‌లో పడ్డట్టయ్యింది. అమితాబ్‌ గనుక ఓకే చెప్తే అతి త్వరలో ఈ సినిమా సెట్స్‌ మీదకు వస్తుంది. సినిమాలో అత్యంత కీలకమైన పాత్ర కాబట్టే ఆ పాత్ర కోసం ఇంకెవర్నీ ఊహించుకోలేకపోతోందట ‘రైతు’ టీమ్‌. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular