HomeMovie News Teluguమెగాస్టార్‌ 70 కోట్ల ప్లస్‌

మెగాస్టార్‌ 70 కోట్ల ప్లస్‌

బాస్‌ ఈజ్‌ బ్యాక్‌ అంటూ వచ్చిన సినిమా ‘ఖైదీ నెంబర్‌ 150’. సుదీర్ఘ విరామం తర్వాత వచ్చిన మెగాస్టార్‌ సినిమా ఇది. మెగా సునామీనే సృష్టించింది. వస్తూ వస్తూనే ఓ ప్రభంజనం సృష్టించాడు. తొలి వారాంతంలోనే 72 మిలియన్స్‌ షేర్‌ దాటేసింది ఖైదీ సినిమా. ఇక ఓవర్సీస్‌లో అయితే రెండు మిలియన్లు దాటింది. ఇంతవరకూ సంక్రాంతి సందర్భంగా ఈ వసూళ్ల వరద కొనసాగింది. అయితే నేటి నుంచి అసలు పరీక్ష స్టార్ట్‌ కానుంది.

ఎందుకంటే ఈ రోజుతో సెలవులు పూర్తయ్యాయి ఉద్యోగులకు సెలవులు పూర్తయ్యాయి. అయినా కానీ స్కూళ్లు, కాలేజీలు సెలవులు ఇంకా రెండు రోజులు ఉండడంతో వసూళ్ల రిజల్ట్‌ని ఇంకా అంచనా వేయలేని పరిస్థితి. ఈ సెలవులు ఈ రోజు, రేపు సినిమాకి బాగా కలిసి రావొచ్చు. మరో పక్క ఈ సినిమాలో మాస్‌ మెచ్చే అన్ని ఎలిమెంట్స్‌ పుష్కలంగా ఉండడంతో బీసీ సెంటర్స్‌లో ఈ సినిమా పూర్తిగా నిలదొక్కుకునే అవకాశాలు లేకపోలేవు.

మొత్తానికి మెగాస్టార్‌ రీ ఎంట్రీ మూవీ అంటే ఎలా ఉండాలో అలాగే ఉంది. వినాయక్‌ పక్కాగా ఆడియన్స్‌ పల్స్‌ని బాగా పట్టుకుని ఈ సినిమాని తెరకెక్కించాడు. చిరంజీవి తనకున్న ఎక్స్‌పీరియన్స్‌తో ఈ సినిమాని ఇంత సక్సెస్‌ చేశాడు. నిర్మాణ విలువల్లో చరణ్‌ తనదైన శైలిని ప్రదర్శించాడు. ఇక ముద్దుగుమ్మ కాజల్‌ ఈ సినిమాతో మెగా హీరోయిన్‌గా ఫిక్స్‌ అయిపోయింది. సినిమా విడుదలై వారం కావొస్తున్నా చిరు మేనియా ఇంకా తగ్గడం లేదనే చెప్పాలి. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular