HomeMovie News Teluguబాలయ్యకు చంద్రబాబు సంక్రాంతి గిఫ్ట్‌

బాలయ్యకు చంద్రబాబు సంక్రాంతి గిఫ్ట్‌

సంక్రాంతికి బాలయ్యకి మంచి ట్రాక్‌ రికార్డు ఉంది. సంక్రాంతికి విడుదలైన సినిమాలతో సక్సెస్‌ల మీద సక్సెస్‌లు కొట్టాడు బాలకృష్ణ. జనవరి 12న బాలయ్య వందో చిత్రంగా రూపొందుతోన్న ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా సంక్రాంతికి మూడు రోజుల ముందే ఏపీ ప్రభుత్వం ఈ చిత్ర యూనిట్‌కి తీపి కబురు చెప్పింది. ఈ సినిమాపై వినోదపు పన్ను మినహాయింపు ఇచ్చింది.

ఇది సంక్రాంతికి బాలయ్యకు చంద్రబాబు ఇస్తోన్న గిఫ్ట్‌ అనే చెప్పొచ్చు. ఇంతకు ముందే తెలంగాణా సీఎం కేసీఆర్‌ కూడా ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇచ్చారు. తెలుగువారంతా గర్వపడే సినిమా ఇది. అందుకే ఈ విషయాన్ని ముందుగానే గమనించిన కేసీఆర్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. కమర్షియల్‌ సినిమా కాకపోయినా, ఈ సినిమా కు భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. అందుకే ఈ సినిమాకు పన్ను మినహాయింపు చాలా పెద్ద ప్లస్‌ కానుంది.

అమరావతి కేంద్రంగా పాలించిన రాజు శాతకర్ణి చరత్రను సినిమా ద్వారా తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్న బాలయ్యను చంద్రబాబు అభినందిస్తూ ఈ ప్రోత్సాహాన్నిచ్చారు. నిజమే ఇలాంటి ప్రోత్సాహం ఈ తరహా కథలకి ఖచ్చితంగా ఉండి తీరాలి. అలాంటప్పుడే మరిన్ని మంచి సినిమాలు మన టాలీవుడ్‌ని పలకరిస్తాయి. క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ముద్దుగుమ్మ శ్రియ శాతకర్ణి భార్యగా నటిస్తోంది. ఈ సినిమాలో ఈమె నటన అత్యద్భుతంగా ఉండనుంది. అలాగే బాలీవుడ్‌ బ్యూటీ హేమామాలిని కీలకపాత్రలో నటిస్తోన్న చిత్రమిది. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular