HomeMovie News Teluguమిల్కీ బ్యూటీ పెళ్లి కబురు చెప్పనుందా?

మిల్కీ బ్యూటీ పెళ్లి కబురు చెప్పనుందా?

అందంతో అందర్నీ ఆకట్టుకుంది. బోలెడంత అభిమానాన్ని సంపాదించుకుంది. దాదాపు పదేళ్లుగా ఇండస్ట్రీలో తన అందచందాలతో ఆడియన్స్‌ని ఎట్రాక్ట్‌ చేస్తోంది. స్టార్‌ హీరోయిన్‌ స్థాయి ఎదిగింది. అయితే ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న సినిమాలు ‘బాహుబలి ది కన్‌క్లూజన్‌’ ఒక్కటే. ఇకపోతే తమిళంలో కొన్ని సినిమాలు చేస్తోంది. పదేళ్లుగా ఒకే రకమైన ఫిజిక్‌తో ఆకట్టుకుంటోన్న ముద్దుగుమ్మ తమన్నా. ఇప్పుడు అంతా తమన్నాను పెళ్లెప్పుడు అని అడుగుతున్నారట.

అందుకు సమాధానంగా, ఇంకా నా కెరీర్‌ పూర్తి కాలేదు. కెరీర్‌లో చేయాల్సిన మరి కొన్ని అద్భుతమైన ప్రాజెక్టులు పెండింగ్‌లోనే ఉన్నాయి. సో ఆ ప్రాజెక్టులు నా చేతికి చిక్కగానే వాటిని కంప్లీట్‌ చేసి తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తాను అంటోందట మిల్కీ బ్యూటీ. ఈ ముద్దుగుమ్మ అనుకుంటోన్న ఆ అద్భుతమైన ప్రాజెక్టులు ఏంటో మరి. హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమా అయిన ‘అభినేత్రి’లో నటించింది. మంచి పేరు దక్కించుకుంది. కెరీర్‌ బెస్ట్‌ మూవీ ‘బాహుబలి’తో ప్రపంచ ప్రఖ్యాతి పొందింది.

ఇంకా తమన్నా అనుకునే బెస్ట్‌ ప్రాజెక్టులు ఏంటో మరి. అయినా కానీ పెళ్లి గురించి మాత్రం తనకు చాలా మంచి అభిప్రాయం ఉందంటోంది. తన సహ నటి సమంత చైతూని ప్రేమించి పెళ్లి చేసుకుంటోంది. అలాగే నాక్కూడా నా మనసుకు నచ్చిన మంచి వ్యక్తి ఎవరైనా దొరికితే వెంటనే పెళ్లికి అంగీకరిస్తానంటోంది తమన్నా. అయితే ఇంతవరకూ ఎవ్వరి ప్రేమలోనూ పడలేదంటోంది మిల్కీ బ్యూటీ. నోట్‌ దిస్‌ పాయింట్‌ తమ్మూ ఫ్యాన్స్‌.

You May Like This
- Advertisment -spot_img

Most Popular