HomeMovie News Teluguప్రభాస్‌ కష్టం ఇంకెవరికీ రాకూడదట

ప్రభాస్‌ కష్టం ఇంకెవరికీ రాకూడదట

‘బాహుబలి’ సినిమాలో ప్రభాస్‌ నిఖార్సయిన ఫిజిక్‌తో కనిపించాడు. సిక్స్‌ ప్యాక్‌ ఫిజిక్‌తో బాహుబలి అంటే బాహుబలే అన్నట్లుగా ప్రభాస్‌ కనిపించిన వైనం గురించి తెలుగు, తమిళ సినీ పరిశ్రమలే కాకుండా బాలీవుడ్‌ కూడా మాట్లాడుకుంటోంది. సిక్‌స ప్యాక్‌ ఫీవర్‌ బాలీవుడ్‌లో చాలా ఎక్కువ. అయినప్పటికీ అక్కడ ప్రభాస్‌ గురించి చర్చించుకోవడం గొప్ప విషయంగానే భావించాలి. అయితే ఇంతగా ప్రభాస్‌ గురించి అందరూ మాట్లాడుకోవడం వెనుక అతని కృషి చాలా ఎక్కువే ఉంది.

ఐదేళ్ళపాటు ఫిజిక్‌ని ఒకేలా ఉంచుకోవడానికి ప్రభాస్‌ ఎంత కష్టపడి ఉండాలి. 100 కిలోలకు పైన బరువు పెంచడానికి పడే కష్టం ఒకలా ఉంటే, దాన్ని మెయిన్‌టెయిన్‌ చెయ్యడం, అవసరానికి తగ్గట్టుగా కొంత బరువు తగ్గించుకోవడం మాటల్లో చెప్పలేనంత కష్టం. అదంతా అనుభవించాడు ప్రభాస్‌. స్పెషల్‌గా ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ని పెట్టుకుని ఆహార నియమాలు పాటిస్తూ, నిత్యం వ్యాయామం చేస్తూ ప్రభాస్‌ ‘బాహుబలి’ కోసం కష్టపడ్డాడు.

ఇన్నేళ్ళలో షూటింగ్‌ జరిగిన రోజులు, షూటింగ్‌ జరగని రోజులూ ఒకేలా కష్టపడాల్సి వచ్చింది ప్రభాస్‌కి. ఎక్కడా ప్రభాస్‌కి రిలాక్స్‌ అయ్యే ఛాన్సే రాలేదు. ఇంత కష్టపడ్డాడు కాబట్టే, ఈ రోజు ప్రభాస్‌కి ఈ రిజల్ట్‌. ‘బాహుబలి’ గురించి ప్రపంచమంతా మాట్లాడుకుంటోంది. వంద సినిమాలు చేస్తే వచ్చే పేరు ఒక్క ‘బాహుబలి’తో వచ్చేసింది ప్రభాస్‌కి. ఇది నిజం.

You May Like This
- Advertisment -spot_img

Most Popular