HomeMovie News Teluguపవన్‌ కళ్యాణ్‌ దేవుడు - వర్మ

పవన్‌ కళ్యాణ్‌ దేవుడు – వర్మ

మెగా ఫ్యామిలీపై ఎప్పుడూ గుర్రమంటూ, సోషల్‌ మీడియా వేదికగా ఇష్టం వచ్చినట్లు సెటైర్లు వేసే రామ్‌ గోపాల్‌ వర్మ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ని దేవుడు అంటూ అభివర్ణించారు. అప్పుడెప్పుడో మొక్కలపై తనకున్న ప్రేమను పవన్‌ కళ్యాణ్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. దాన్ని కోడ్‌ చేస్తూ వర్మ ఇప్పుడు ఆయన దేవుడు అని అభివర్ణించడం ఒకింత తమాషాగానూ, మరి కొంత విచిత్రంగానూ ఉంది. వర్మతో ఏదొచ్చినా కష్టమే.

ఆయన ఎప్పుడు ఎవర్ని పొగుడుతారో, ఎందుకు పొగుడుతారో తెలీదు. అలాగే ఎందుకు విమర్శిస్తారో కూడా తెలీదు. మొన్నీ మధ్యే ఉమెన్స్‌ డే రోజు మహిళ అంటే సన్నీలియోన్‌లా ఉండాలని ఆమెతో పోల్చి వివాదాలకు కేంద్ర బిందువయ్యారు. ఇప్పుడు తాజాగా పవన్‌పై చేసిన వ్యాఖ్యలను పొగడ్త అనుకోవాలా? లేక సెటైర్‌ అనుకోవాలో తెలీక తలలు పట్టుకుంటున్నారు పవన్‌ అభిమానులు.

పవన్‌ అంటే చాలా మందికి దేవుడే. అయితే వర్మలాంటి వాళ్లు ఆయన్ని దేవుడని అభివర్ణించడం పట్ల దీన్ని ఎలా అర్ధం చేసుకోవాలో తెలీడం లేదు ఫ్యాన్స్‌కి. అసలు ఇది సెటైరా? లేక పవన్‌ మీద అతనికున్న భక్తా? లేక నిజంగానే కాంప్లిమెంటా? అనేది తెలీడం లేదు. ఇందులోని అసలు అర్ధం చెప్పిన వర్మకే తెలియాలి గానీ, ఆయన్ని అర్ధం చేసుకోవడం ఎవ్వరి వల్లా కాదని మాత్రం బోధపడుతోంది. అదే కదా వర్మ అంటే. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular