HomeMovie News Teluguమహేష్‌ దూకుడు పెంచేశాడు

మహేష్‌ దూకుడు పెంచేశాడు

ఓ పక్క మురుగదాస్‌ దర్శకత్వంలో మహేష్‌ సినిమా సెట్స్‌పై ఉండగానే మరో సినిమాని లైన్‌లో పెట్టేశాడు మహేష్‌బాబు. అంతే కాదు వచ్చే నెల నుండే ఈ సినిమాని పట్టాలెక్కించడానికి సిద్ధంగా ఉన్నాడు కూడా. ఈ సినిమాను కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘శ్రీమంతుడు’ మహేష్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ కమర్షియల్‌ హిట్‌ని సొంతం చేసుకుంది. అందుకే మళ్లీ ఈ కాంబినేషన్‌ అంటే ఎక్స్‌పెక్టేషన్స్‌ ఎక్కువవుతున్నాయి. ఈ సినిమాకి ‘భరత్‌ అను నేను’ అనే టైటిల్‌ని ఫిక్స్‌ చేశారు.

టైటిల్‌ పరంగా చూసినా కూడా చాలా క్యాచీగా ఉంది. ప్రస్తుతం మురుగదాస్‌తో మహేష్‌ చేస్తున్న సినిమా భారీ బడ్జెట్‌తో పవర్‌ఫుల్‌ సబ్జెక్ట్‌తో తెరకెక్కుతోంది. తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతోంది ఈ చిత్రం. కాగా ప్రస్తుతం కొరటాలతో చేయబోయే సినిమా కూడా పవర్‌ ఫుల్‌ సబ్జెక్టే అని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకి పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు అతి వేగంగా జరుగుతున్నాయి. మరో పక్క మురుగదాస్‌ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది.

త్వరలోనే ఈ సినిమా నుండి ప్యాకప్‌ అయిపోయి మహేష్‌ కొత్త సినిమా సెట్స్‌లో సందడి చేయనున్నాడట. ఈ సినిమాకి ‘శ్రీమంతుడు’ సినిమాకి మ్యూజిక్‌ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ ఇవ్వనున్నారట. అలాగే హీరోయిన్‌ కోసం ప్రస్తుతం పరిశీలన జరుగుతోంది. మొదట్లో హీరోయిన్‌గా కీర్తి సురేష్‌ని అనుకున్నారు. అయితే అది ఇప్పుడు సస్పెన్స్‌లో పడింది. ఇంకా హీరోయిన్‌ విషయంలో క్లారిటీ లేదు. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular