HomeMovie News Teluguసమంత కోసం వంటింట్లో నాగచైతన్య

సమంత కోసం వంటింట్లో నాగచైతన్య

ముద్దుగుమ్మ సమంతకి, అక్కినేని అందగాడు నాగచైతన్యలు లవ్‌లో ఎంజాయ్‌ చేస్తున్నారు ప్రస్తుతం. అందులో భాగంగా సమంతకి నాగచైతన్య బ్రేక్‌ఫాస్ట్‌ ప్రిపేర్‌ చేస్తాడట. ఆ విషయం సమంత సరదాగా వెల్లడించింది సోషల్‌ మీడియాలో. తనను మహారాణిలా చూసుకుంటున్నాడంటూ నాగచైతన్యను పొగడ్తలతో ముంచెత్తేసింది. బయటకు వెళ్ళేటప్పుడు సమంత కోసం బ్రేక్‌ఫాస్ట్‌ రెగ్యులర్‌గా నాగచైతన్య ప్రిపేర్‌ చేస్తాడనే అర్థం వచ్చేలా ఆమె చెప్పిందిగానీ, ఇదేదో సరదాగాకి చేసినట్లే భావించాలేమో.

నాగచైతన్యతో సమంత ప్రేమలో పడ్డాక, ఇద్దరి ప్రేమపై అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత సమంత – నాగచైతన్య ‘మ్యాజిక్‌ లవ్‌ మూమెంట్స్‌’ని ఇలా సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుంటున్నారు. అభిమానులకు ఈ ఫొటోలు భలే ఇంట్రెస్టింగ్‌గా ఉంటున్నాయి. అసలే సమంత క్యూట్‌, ఈ ఫొటోలతో సమంత ఇంకా ఇంకా క్యూట్‌గా అనిపిస్తోంది. త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న చైతూ, సమంతల లవ్‌ స్టోరీ అభిమానుల్ని బాగా ఎంటర్‌టైన్‌ చేస్తోంది. స్క్రీన్‌ మీద లవ్‌లో రొమాంటిక్‌ సీన్స్‌తో ఆకట్టుకున్న వీరిద్దరూ రియల్‌ లైఫ్‌ లవ్‌ స్టోరీలో కూడా అలరిస్తున్నారు.

తమ లవ్‌ స్టోరీలోని స్వీట్‌ మెమరీస్‌ని అందరూ ఇంతిలా పంచుకోరు. కానీ ఈ విషయంలో సమంత, చైతూ స్పెషల్‌. చైతూ కన్నా ముందే సమంత తన స్వీట్‌ ఎక్స్‌పీరియన్స్‌ని ఫ్యాన్స్‌తో పంచుకోవడంలో ముందుంటుంది. అందుకే సమంతకు సోషల్‌ మీడియాలో అంత ఫాలోయింగ్‌ ఉంది. ఏది ఏమైనా చైతూ, సమంతకి వంట చేసి పెట్టడం అనే ఫీలింగ్‌ సూపర్బ్‌గా ఉంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular