HomeMovie News Teluguఎన్టీఆర్ సినిమాపై షాకింగ్ గాసిప్‌

ఎన్టీఆర్ సినిమాపై షాకింగ్ గాసిప్‌

ఎన్టీఆర్ కొత్త సినిమా సంచ‌ల‌నాల‌కు వేదికగా మారుతోంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ తొలిసారి త్రిపాత్రాభిన‌యం చేయ‌బోతున్నాడు. ఇందులో ఓ పాత్ర‌లో నెగిటీవ్ ఛాయ‌లు క‌నిపిస్తాయ‌న్న‌ది ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు షాకింగ్ విష‌య‌మే. అయితే ఇప్పుడు మ‌రో షాక్ త‌గిలింది. ఈసినిమా క‌థ‌.. త‌మిళంలో విజ‌య్ క‌థానాయ‌కుడిగా తెర‌కెక్కుతున్న సినిమా క‌థా ఒక్క‌టే అన్న‌ది స‌రికొత్త గాసిప్. త‌మిళంలో విజ‌య్ క‌థానాయ‌కుడిగా ఓ సినిమా తెరకెక్కుతోంది. రాజు రాణీతో ఆక‌ట్టుకొన్న అట్లీ ద‌ర్శ‌కుడు.

ఈ సినిమాకీ ఎన్టీఆర్ సినిమాకీ కొన్ని పోలిక‌లు క‌నిపిస్తున్నాయి. అదేంటంటే… ఎన్టీఆర్ లానే…. విజ‌య్ కూడా త‌న కొత్త సినిమాలో త్రిపాత్రాభిన‌యం చేస్తున్నాడు. అంతే కాదు… అందులో విజ‌య్ నెగిటీవ్ క్యారెక్ట‌ర్ ఒక‌టి ప్లే చేస్తున్నాడు. సో.. ఎన్టీఆర్‌, విజ‌య్‌ల కథ ఒక్క‌టే అయ్యే అవ‌కాశాలున్నాయ‌ని టాలీవుడ్‌లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ఒకే క‌థ ఎన్టీఆర్‌, విజ‌య్‌లు పంచుకొన్నారా, లేదంటే ఈ ఇద్ద‌రు ద‌ర్శ‌కులూ ఒకే హాలీవుడ్ క‌థ‌ని ఎత్తేశారా?? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిజానిజాలేంటో తెలియాలంటే ఇంకొంత కాలం ఎదురు చూడాల్సిందే.

You May Like This
- Advertisment -spot_img

Most Popular