HomeMovie News Teluguస‌మంత ఇదీ వ‌దిలేసిందా??

స‌మంత ఇదీ వ‌దిలేసిందా??

స‌మంత మూడ్ ఎప్పుడో సినిమాల నుంచి… పెళ్లిపైకి  మ‌ళ్లింది. అందుకే జ‌న‌తా గ్యారేజ్ త‌ర‌వాత కొత్త క‌థ‌లు విన‌డానికీ, కొత్త సినిమాల‌పై సంత‌కాలు చేయ‌డానికీ ఒప్పుకోలేదు. ఎట్ట‌కేల‌కు రామ్ చ‌ర‌ణ్ – సుకుమార్ సినిమాకి స‌మంత ఓకే చెప్పింది. దాంతో స‌మంత మ‌ళ్లీ సినిమాల వైపు దృష్టి సారించింద‌నుకొన్నారంతా. అయితే ఇప్పుడు స‌మంత ఓ గ‌ట్టి షాక్ ఇచ్చింది. సుక్కు సినిమా నుంచి స‌మంత బ‌య‌ట‌కు వ‌చ్చేసింద‌ని టాక్‌. `ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో ఈ సినిమా చేయ‌లేను.. సారీ` అంటూ ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు క‌బురు పంపింద‌ట స‌మంత‌.

చైతూ – స‌మంత‌ల పెళ్లికి డేట్ ద‌గ్గ‌ర ప‌డింద‌ని, అందుకే… స‌మంత ఈ సినిమాని వ‌దులుకొంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. నిజానికి వీరిద్ద‌రి పెళ్లి 2017 చివ‌ర్లో చేద్దామ‌నుకొన్నారు కుటుంబ స‌భ్యులు. అఖిల్ పెళ్లి.. స‌డ‌న్‌గా ఆగిపోవ‌డంతో చైతూ – స‌మంత‌ల పెళ్లి డేట్ ముందుకొచ్చింద‌ని, అందుకే స‌మంత త‌న చేతిలో ఉన్న ఏకైక సినిమానీ వ‌దులుకొంద‌న్న టాక్ వినిపిస్తోంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular