HomeMovie News Teluguబాహుబ‌లి 2 ... ఆడియో రిలీజ్ డేట్ ఫిక్స్డ్

బాహుబ‌లి 2 … ఆడియో రిలీజ్ డేట్ ఫిక్స్డ్

బాహుబ‌లి ది క‌న్‌క్లూజ‌న్ హంగామా మొద‌లైంది. రాజ‌మౌళి అండ్ టీమ్ ఇప్పుడు ఈ సినిమా ప్ర‌మోష‌న్‌పై ఫోక‌స్ పెట్టింది. అందుకే లుక్కుల మీద లుక్కులు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ఇప్పుడు ఆడియో వేడుకకు రంగం సిద్ధం అవుతోంది.  బాహుబ‌లి ది బిగినింగ్ ఆడియో ఫంక్ష‌న్ తిరుప‌తిలో ఘ‌నంగా జ‌రిగింది. ఈసారీ అక్క‌డే పాట‌ల్ని విడుద‌ల చేస్తార‌నుకొన్నారు. అయితే.. చిత్ర‌బృందం కొత్త వేదిక ఫిక్స్ చేసింది. రామోజీ ఫిల్మ్‌సిటీలో ఆడియో ఫంక్ష‌న్ ఏర్పాటు చేసే ప్ర‌య‌త్నాల్లో ఉంది చిత్ర‌బృందం.

అక్క‌డే బాహుబ‌లికి సంబంధించిన భారీ సెట్లు వేశారు. మ‌షిష్మ‌తీ సమ్రాజ్యాన్నీ అక్క‌డే `సెట్‌` చేశారు.  అదే సెట్లో పాట‌ల్ని ఆవిష్క‌రించాల‌ని చిత్ర‌బృందం డిసైడ్ అయ్యింద‌ట‌. ఉగాది సంద‌ర్భంగా ఈనెల 29న పాట‌లు విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంద‌ని టాక్‌. ఉగాదికి ముందు రోజు (28న‌), ఉగాది మ‌రుస‌టి రోజు (30న‌) డేట్లు బ్లాక్ చేసి పెట్టుకొన్నార‌ని తెలుస్తోంది. ఈ మూడు రోజుల్లో ఏదో ఓ రోజు ఫిక్స్ అయ్యే ఛాన్సులు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి.

You May Like This
- Advertisment -spot_img

Most Popular