HomeMovie News Teluguఅరవింద్‌ స్వామితో అమల

అరవింద్‌ స్వామితో అమల

హ్యాండ్‌సమ్‌ హీరో అరవింద్‌ స్వామి తెలుగులో ఈ మధ్యే విలన్‌గా తన సత్తా చాటాడు. రామ్‌ చరణ్‌ హీరోగా వచ్చిన ‘ధృవ’ సినిమాతో అరవింద్‌ స్వామికి తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. తాజాగా ఈ హ్యాండ్‌సమ్‌ తమిళంలో ఓ సినిమా చేస్తున్నాడు. మలయాళంలో విజయం సాధించిన ‘భాస్కర్‌ ది రాస్కెల్‌’ చిత్రాన్ని తమిళంలో అరవింద్‌ స్వామి హీరోగా రీమేక్‌ చేస్తున్నారు. ఈ సినిమాలో అరవింద్‌ స్వామికి జంటగా ముద్దుగుమ్మ అమలాపాల్‌ నటిస్తోంది. వివాహ బంధం రద్దు చేసుకున్నాక ముద్దుగుమ్మ అమలాపాల్‌ ఇప్పటికే తమిళంలో పలు చిత్రాలతో బిజీగా ఉంది. అలాగే మలయాళంలో కూడా ఈ ముద్దుగుమ్మ నటిస్తోంది.

ఈ తాజా చిత్రంతో అమలాకి నటిగా ఇంకా మంచి పేరు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మరో పక్క అరవింద్‌ స్వామి హీరోగానే కాకుండా, విలన్‌గా కూడా తన సత్తా చాటాడు, తెలుగులో ‘ధృవ’తో పాటు, తమిళంలో ‘తనీఒరువన్‌’ చిత్రంతోనూ కూడా అరవింద్‌స్వామి తానేంటో చూపించాడు. ఇక మలయాళంలో సూపర్‌ హిట్‌ అయిన ఈ సినిమాలో ముమ్ముట్టి నటించిన పాత్రను అరవింద్‌ స్వామి పోషిస్తుండగా, నయనతార పోషించిన పాత్రలో అమలాపాల్‌ నటిస్తోంది. అమలాపాల్‌కి ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెడుతుందని భావిస్తున్నారు కోలీవుడ్‌ జనం.

You May Like This
- Advertisment -spot_img

Most Popular