HomeMovie News Teluguదటీజ్‌ పూరి జగన్నాధ్‌

దటీజ్‌ పూరి జగన్నాధ్‌

పూరీ జగన్నాధ్‌ పని అయిపోయింది అనుకున్నారంతా. పూరీ ఏ సినిమా చేసినా వర్కవుట్‌ కావడం లేదు అని లెక్కేసేశారు. ఎన్టీఆర్‌తో చేసిన ‘టెంపర్‌’ సినిమాతో ఆ స్థాయి నుండి ఓ లెవల్‌కి వచ్చినా కానీ, పూరీని లెక్క చేయలేదు. తాజాగా కొత్త నటీనటులతో ‘రోగ్‌’ సినిమాని తెరకెక్కిస్తున్నారు పూరీ జగన్నాధ్‌. ఈ సినిమా త్వరలోనే రిలీజ్‌కి రెడీ ఉంది. ఈ మధ్యే విడుదలైన మోషన్‌ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. పూరీ స్టైల్లోనే స్పెషల్‌గా ఎట్రాక్ట్‌ చేస్తోంది ఆ పోస్టర్‌.

ఇదిలా ఉండగా పూరీ జగన్నాధ్‌ అనూహ్యంగా ఓ అనౌన్స్‌మెంట్‌ చేశారు తాజాగా. అదే బాలకృష్ణతో పూరీ సినిమా. మార్చి 9న ఈ సినిమా ప్రారంభం కానుంది. ఇందులో వెరైటీ ఏముంది. కానీ విడుదల డేట్‌ కూడా చెబితేనే వెరైటీ అనుకుంటున్నారా? అందుకే రిలీజ్‌ డేట్‌ కూడా ముందే ప్రకటించేశాడు పూరీ. అదే పూరి స్పెషాలిటీ. సెప్టెంబర్‌ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోందట ఈ సినిమా. మరి పూరి అంటే ఏమనుకున్నారు. ఖచ్చితంగా అన్న డేట్‌కి తీసుకొచ్చి తీరతాడంతే.

మామూలుగానే చాలా తక్కువ రోజుల్లో పూరీ సినిమాలు కంప్లీట్‌ చేస్తాడనే టాక్‌ ఉంది. ఇక స్టార్టింగ్‌ డేట్‌తోనే రిలీజింగ్‌ డేట్‌ కూడా అనౌన్స్‌ చేసి అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు పూరీ జగన్నాద్‌. అసలు చిరంజీవితో పూరీ జగన్నాధ్‌ సినిమా చేయాల్సి ఉంది. కానీ కొన్ని కారణాలతో అది జరగలేదు. ఇప్పుడు బాలకృష్ణతో సినిమా అనౌన్స్‌ చేయడంతో పూరీ ఈజ్‌ బ్యాక్‌ అనక తప్పడం లేదు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular