HomeMovie News Teluguహీరోయిన్లకు 'ఆ' వేధింపులు మామూలేనట

హీరోయిన్లకు ‘ఆ’ వేధింపులు మామూలేనట

హీరోయిన్‌ బావన కిడ్నాప్‌ ఘటన తర్వాత సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న వేధింపుల గురించి ఒకొరరుగా మీడియా ముందుకు వస్తున్నారు. సినీ పరిశ్రమలో హీరోయిన్లకు వేధింపులు మామూలేననీ, అవకాశాల కోసం ఆత్మగౌరవాన్ని చంపుకోవాల్సిన పరిస్థితుల్ని కల్పిస్తారనీ, వాటి నుంచి బయటపడటం అంత తేలిక కాదని గతంలోనే బాలీవుడ్‌ భామ కంగనా రనౌత్‌ చెప్పింది. ఇంకొందరు హీరోయిన్లు కూడా ఇదే మాట చెప్తారు. అయితే ధైర్యంగా వాటిని అధిగమించినవాళ్ళే హీరోయిన్లుగా సక్సెస్‌ అవుతారని కూడా హీరోయిన్లు చెప్పడం వింటున్నాం. అలనాటి అందాల తార నగ్మా, సినీ పరిశ్రమలో వేధింపుల గురించి మాట్లాడుతూ తనకు కూడా సమస్యలు ఎదురైనట్లు చెప్పింది.

బాహ్య ప్రపంచంలో ఎలాగైతే ఉంటుందో సినీ పరిశ్రమ కూడా అంతేనని చెబుతూ చాలా సందర్భాల్లో మన ధైర్యమే మనకు శ్రీరామ రక్ష అని ఆమె వివరించింది. సమస్య ఎదురైనప్పుడు దాన్ని ప్రతిఘటించాల్సి ఉంటుందని భావన ఈ విషయంలో పోలీసులను ఆశ్రయించడం చాలా గొప్ప పని అని చెప్పింది నగ్మా. వేధింపులు లేని సమాజం కావాలంటే ముందుగా మగవాళ్ళ ఆలోచనల్లో మార్పు రావాల్సి ఉంటుందనీ అలాగే మహిళల్లో ధైర్యం పెరగాలని కూడా హీరోయిన్లు అభిప్రాయం వెలిబుచ్చుతున్నారు. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular