HomeMovie News Teluguమెగా బ్యానర్‌లో ఎన్టీయార్‌?

మెగా బ్యానర్‌లో ఎన్టీయార్‌?

మెగాస్టార్‌ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడమే కాదు. మెగాస్టార్‌ రీ ఎంట్రీ సినిమాతోనే మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ తొలిసారిగా నిర్మాతగా అవతారమెత్తాడు. ఆ బ్యానర్‌లో తొలి సినిమా చిరంజీవి 150వ సినిమాగా తెరకెక్కించిన రామ్‌ చరణ్‌, చిరు 151వ చిత్రాన్ని కూడా అదే బ్యానర్‌లో తెరకెక్కించనున్నాడు. అయితే మిగతా హీరోల సినిమాలు కూడా ఈ బ్యానర్‌లో రూపొందిస్తానని చరణ్‌ చెప్పాడు. అందులో భాగంగా ఇప్పుడు రామ్‌చరణ్‌ నిర్మాతగా ఎన్టీయార్‌ హీరోగా సినిమా రాబోతోందంటూ ప్రచారం జరుగుతోంది.

తన సొంత బ్యానర్‌లో వరుసగా రెండు సినిమాలు చిరంజీవితోనే తెరకెక్కిస్తున్న రామ్‌చరణ్‌, మూడో సినిమాని మాత్రం నందమూరి హీరోతో చెయ్యబోతున్నాడట. త్వరలోనే అధికారికంగా ఈ మెగా న్యూస్‌ బయటకు రానుందని సమాచారమ్‌. నిజమైతే మాత్రం తెలుగు సినీ పరిశ్రమలో ఇదొక సంచలనమే అవుతుంది. స్వర్గీయ ఎన్టీఆర్‌తో చిరంజీవి అప్పట్లో స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు. చాలాకాలం క్రితం నాటి మాట అది. బాలకృష్ణతోనూ చిరంజీవికి సన్నిహిత సంబంధాలున్నాయి. ఇద్దరూ మంచి స్నేహితులు కూడా. అయితే వీరిద్దరూ కలిసి తెరను పంచుకున్నది లేదు.

కానీ ఈ జనరేషన్‌లో చరణ్‌, ఎన్టీఆర్‌లు ఆ కోరిక తీర్చనున్నారేమో అభిమానులకు చూడాలి. ఎన్టీయార్‌, చరణ్‌ కూడా గుడ్‌ ఫ్రెండ్స్‌. తమ ఫ్రెండ్‌షిప్‌ ఈ రకంగా ఇంకా బలపడే అవకాశాలున్నాయి. ఏది ఏమైనా అభిమానుల మధ్యే వైరం. హీరోలు మాత్రం తమ పర్సనల్‌ విషయాల్లో ఒకరితో ఒకరు చాలా ఫ్రెండ్లీగా మసలుతూ ఉంటారు. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular