మొన్న నటి భావన పై జరిగిన సంఘటన యావత్ దేశాన్ని షాక్ కి గురి చేసింది.
ఆ సంఘటన పైన రకుల్ ప్రీత్ స్పందిస్తూ, తనకి కూడా ఒకసారి ఇలాంటి సంఘటననే ఎదురైందని, అయితే తను ధైర్యంగా తన పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వాడిని ఎదుర్కోవడమే గాక అతను ఎప్పటికి మరిచిపోని విధంగా దేహశుద్ది కూడా చేశానని చెప్పింది. అయితే అప్పటినుండి మాత్రం చుట్టుపక్కల మాత్రం గమనిస్తూ ఉంటానని ఆ సంఘటన తరువాత తన తల్లి కూడా కొత్త ప్రదేశాలకు వెళుతున్నప్పుడు జాగ్రతలు చెప్పడం మొదలుపెట్టింది అట.
భావన సంఘటన్ గురించి మాట్లాడుతూ, తనకే గనుక ఆ పరిస్థితి వస్తే అలా చేసినవారిని చంపడానికైనా సిద్ధం అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది. అదే సమయంలో స్త్రీల పైన ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే మనం మదర్స్ డేలు, ఉమెన్స్ డేలు జరుపుకోవడంలో అర్ధంలేదని తేల్చేసింది.
మనం కూడా రకుల్ ప్రీత్ వ్యాఖ్యని సమర్దించాల్సిన పరిస్థితి కచ్చితంగా ఉందనిపిస్తుంది ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే.





